ఆరు పరుగులకు ఆలౌట్ కథ! ఇదీ రికార్డే!

ఆరు పరుగులకు ఆలౌట్ కథ! ఇదీ రికార్డే!
x
Highlights

గల్లీలో క్రికెట్ ఆడే చిన్నోళ్ళు కూడా పది బంతులాడితే కనీసం నలుగు పరుగులు తీస్తారు. సరే.. సరదాగా ఆడే క్రికెట్ లో అయినా సరే.. ఓ జట్టు 20 ఓవర్లలో కనీసంగా...

గల్లీలో క్రికెట్ ఆడే చిన్నోళ్ళు కూడా పది బంతులాడితే కనీసం నలుగు పరుగులు తీస్తారు. సరే.. సరదాగా ఆడే క్రికెట్ లో అయినా సరే.. ఓ జట్టు 20 ఓవర్లలో కనీసంగా 20 పరుగులన్నా చేస్తుంది. అయితే.. ఒక అంతర్జాతీయ మ్యాచ్ లో చెత్త మ్యాజిక్ ఒకటి రికార్డయింది మంగళవారం. క్విబుక మహిళల టీ20 టోర్నీ లో భాగంగా మాలి, రువాండా మహిళా జట్లు తలబడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన మాలి జట్టు సరిగ్గా 9 ఓవర్లు ఆడి ఆరంటే ఆరు పరుగులు చేసింది. ఇదే ఇంత చెత్తగా అనిపిస్తోందా.. ఇక్కడ ఇంకో విషయం కుడా ఉందండోయ్.. ఇందులో బ్యాటుతో సాధించిన పరుగు ఒక్కటంటే ఒక్కటే! మిగిలిన ఐదు ఎగస్ట్రాలు. దీన్ని బట్టి అర్థం అయిందా మాలి జట్టు ఎంత చెత్తగా ఆడిందో. పదకొండు మందిలో ఓపెనర్ సమకే ఒక్క పరుగు చేసింది. మిగిలిన పదిమందీ జీరో! ఇందులోనూ ఇంకో సంగతి ఉంది.. ఒక్కరు మినహా అందరూ 6 లేదా 7 బంతులాడారు. కానీ కౌలిబెలి అనే మహిళా క్రికెటర్ మాత్రం జాగ్రత్తగా పన్నెండు బంతులు ఆడింది. ఎంత ఓపికో కదా.. అన్నట్టు ఈ ఏడాది చైనా యూఏఈ పై చేసిన 14 పరుగుల చెత్త రికార్డును మాలి సవరించింది. ఇక ఈ రికార్డును సవరించే వాళ్ళెవరూ ఉండరేమో?

Show Full Article
Print Article
More On
Next Story
More Stories