ఈ ఏడాది రన్నింగ్ మిషన్స్ వీరే..

ఈ ఏడాది రన్నింగ్ మిషన్స్ వీరే..
x
Highlights

ప్రత్యర్థి జట్టు ఏదైనా, బౌలర్ ఏలాంటి వాడైనా సరే బ్యాట్ తో విరుచుపడటమే వారిపని.

ప్రత్యర్థి జట్టు ఏదైనా, బౌలర్ ఏలాంటి వాడైనా సరే బ్యాట్ తో విరుచుపడటమే వారిపని. సెంచరీ కొట్టేవరకు వారు విశ్రమించరు. మూడు అంకెల స్కోరు సాధించే వరకు వారికి అసటే ఉండదు.. ప్రతి మ్యాచ్‌లోనూ బౌలర్లను కంగారు పెట్టిస్తూ, సెంచరీల మీద సెంచరీలు బాదుతున్న ఈ ఏటి మేటి ఆటగాళ్లు జాబితా ఒకసారి చూద్దాం..

అందరికంటే ముందుంటాడు టీమిండియా బ్యాట్స్‌మెన్. ప్రత్యర్థి బౌలర్ పై విరుచుపడడమే అతని పని అన్నట్లు భారీ ఇన్నింగ్స్ ఆడతాడు. సెంచరీకి ఒక పరుగు దూరంలో ఉన్న నిలకడగా ఆడడు. బంతిని బౌండరీకి తరలిస్తాడు. బహుశ ఇతని బ్యాటింగ్ చూస్తే టీమిండియా మాజీ ఆటగాడు సెహ్వాగ్ గుర్తుకొస్తాడు. ఇక ఇపాటికే అర్ధమై ఉంటుంది ఏవరనేది. అతనే హిట్ మ్యాన్ అని భారత అభిమానులు పిలుస్తుంటారు.

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ. రోహిత్ ఈ సంవత్సరం అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో రాణిస్తూ ప్రత్యర్థి జట్టు బౌలర్లను చిల్చీచెండాడుతూ..తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. ఈ సంవత్సరం జరిగిన ప్రపంచ కప్ లో ఏకంగా ఐదు సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా ఈ ఏడాది టెస్టుల్లో ఓపెనర్ గా మారాడు. ఈ సంవత్సరం వన్డేల్లో 7 సెంచరీలు, ఇక టెస్టు్ల్లో 3 సెంచరీలు చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ బాదీన హీరో రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలిచాడు.

ఇక ఈ ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచాడు రన్నింగ్ మిషన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. గత రెండు సంవత్సరాలుగా కోహ్లీ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అదే ఊపును ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నాడు. 2019 సంవత్సరంలో కూడా వన్డేల్లో 5సెంచరీలు, టెస్టుల్లో రెండు సెంచరీలు సాధించాడు. అయితే ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో కోహ్లీ సెంచరీ సాధించలేదు.

అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ మొదటి సారి డబుల్ సెంచరీ బాదాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కోహ్లీ రికార్డుకెక్కాడు. అంతేకాదు విజ్డన్ ప్రకటించిన డ్రీమ్ టీంకు కోహ్లీని కెప్టెన్ గా ప్రకటించింది. టీ20ల్లో విండీస్ పై చెలరేగి ఆడాడు. రెండో టీ20లో 94పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే ఈ ఏడాది వన్డే, టెస్టు ఫార్మాట్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నా. టీ20ల్లో మాత్రం పదోస్థానంలో కొనసాగుతున్నాడు.

రీ ఎంట్రీతో అదరగొట్టాడు ఆస్టేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొని స్టివ్ స్మీత్‌తో పాటు ఏడాదిపాటు బహిష్కరణకు గురైయ్యాడు. అయితే తిరిగి జట్టులోకి పునరాగమనం చేసిన అనంతరం అదరగొట్టాడు. కీలకమైన యాషెస్ టెస్టులో పేలవ ప్రదర్శన చేసి నిరాశపరిచినా, పాకిస్థాన్ తో జరిగిన టెస్టు సిరీస్ లో పుంజుకున్నాడు. తనదైన మార్క్ ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. ఇక అడిలైడ్ టెస్టులో అజేయంగా 335 చేశాడు. ఈ మ్యాచ్ లో వార్నర్ లారా రికార్డు అధిగమిస్తాడని అంతా ఊహించారు. అయితే ఆసీసీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో లారా రికార్డు పదిలంగానే ఉంది. వార్నర్ ఈ సంవత్సరం ఒక సెంచరీ, టెస్టుల్లో రెండు, వన్డేల్లో మూడు, పొట్టి ఫార్మాట్లో ఒక సెంచరీ సాధించాడు.

ఇక అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ ఉన్నాడు. టెస్టులు, వన్డేల్లో మూడు శతకాలు సాధించాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ 10లో చోటు సంపాదించాడు. టీ20ల్లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అజామ్ ఈ ఏడాది పాకిస్థాన్ తరపున ఆడిన కొన్ని మ్యాచ్‌లు అయినప్పటీకీ అతను నిలకడగా రాణిస్తు పరుగులు చేస్తున్నాడు. అంతే కాదు టీ20ల్లో బెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కంటే మెరుగైన స్థానంలో నిలవడం విశేషం. azam

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ ఆ జట్టు ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు అన్ని ఫార్మాట్లో నిలకడగా రాణించాడు . ఈ సంవత్సరం ఐదు సెంచరీలు కొట్టాడు. న్యూజిలాండ్ పైజరిగిన టెస్టు మ్యాచ్ లో డబుల్ సెంచరీ బాదాడు.

వెస్టిండీస్ ఆశాస్వప్నం షై హోప్ అతను వన్డేల్లో చెలరేగిపోయాడు. ఐదేళ్ల తర్వాత విండీస్ వన్డే సిరీస్ గెలవడంలో హోప్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది వన్డేల్లో నాలుగు సెంచరీలు చేసి టాప్ 10 రేసులో ఉన్నాడు. టెస్టుల్లో ఆరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు.

ఈ జాబితాలో చివరిగా ఉన్న క్రికెటర్ ఆస్ట్రేలియా ఆటగాడు వన్డే కెప్టెన్ ఫించ్. ఈ సంవత్సరం 23 వన్డేలు ఆడిన ఫించ్ 4 సెంచరీలు కొట్టాడు. ప్రపంచకప్ లో రెండు సెంచరీలు సాధించాడు. కీలక ఆటగాళ్లు రా‎ణించని సమయంలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. పొట్టి ఫార్మాట్ లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఫించ్ ఈ సంవత్సరం ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories