India vs Engalnd: ఇంగ్లాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇప్పటికే టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న టీమిండియా.
India vs Engalnd: ఇంగ్లాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇప్పటికే టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న టీమిండియా. కాగా, రేపటి నుంచి ఐదు టీ20ల సిరీస్‌కు మొదలుకానుంది. శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈమేరకు నిర్వహించిన ప్రెస్ కాన్సరెన్స్‌లో కోహ్లీ మాట్లాడాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు దిగుతాడని విరాట్ పేర్కొన్నాడు.
రోహిత్, రాహుల్ ఇద్దరిలో ఎవరికైనా విశ్రాంతి ఇవ్వాల్సి వస్తే శిఖర్ ధావన్ మూడో ఓపెనర్‌గా ఆడతాడు. ఇప్పటికైతే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఓపెనర్లు. టీం ఇండియాలో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి మా బ్యాట్స్‌మెన్ మరింత స్వేచ్ఛగా ఆడతారు అని తెలిపాడు.
కాగా, ఈ ఏడాది భారత్‌లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ టీం ఫేవరేట్ అని కోహ్లి అన్నాడు. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్.. టీమిండియానే ఫేవరెట్ అని అభిప్రాయపడగా, కోహ్లి మాత్రం ఇంగ్లండ్ ఫేవరెట్ అని చెప్పడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో టీ20 వరల్డ్‌కప్ నిర్వహించడానికి ఐసీసీ సన్నద్ధమవుతోంది.
️🗣️ "Very glad to have Bhuvi back."
— BCCI (@BCCI) March 11, 2021
Ahead of the @Paytm #INDvENG T20I series opener, #TeamIndia skipper @imVkohli speaks about @BhuviOfficial's return to the side 👍👍 pic.twitter.com/26DCpBbd90
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire