IND vs NZ 2nd Test: పుణే టెస్ట్ నుంచి కేఎల్ రాహుల్ తప్పుకుంటాడా? షాకింగ్ న్యూస్ చెప్పిన గౌతమ్ గంభీర్

KL Rahul Part of Team India Playing xi Says Gautam Gambhir in Press Conference Before ind vs NZ Test
x

IND vs NZ 2nd Test: పుణే టెస్ట్ నుంచి కేఎల్ రాహుల్ తప్పుకుంటాడా? షాకింగ్ న్యూస్ చెప్పిన గౌతమ్ గంభీర్

Highlights

India vs New Zealand 2nd Test: భారత్-న్యూజిలాండ్ మధ్య 3 టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ గురువారం (అక్టోబర్ 24) పూణెలో ప్రారంభం కానుంది.

India vs New Zealand 2nd Test: భారత్-న్యూజిలాండ్ మధ్య 3 టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ గురువారం (అక్టోబర్ 24) పూణెలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్లేయింగ్-11పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో భారీ ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమవుతున్న కేఎల్‌ రాహుల్‌ని పక్కన పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. గత మ్యాచ్‌లో 150 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి అవకాశం దక్కనుందని తెలుస్తోంది. శుభ్‌మన్ గిల్ పునరాగమనం కారణంగా రాహుల్, సర్ఫరాజ్‌లలో ఒకరు ఔట్ అవుతారని చెబుతున్నారు.

రాహుల్‌కి సంబంధించి బిగ్ అప్‌డేట్..

మ్యాచ్‌కు ఒక రోజు ముందు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో రాహుల్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చాడు. తదుపరి మ్యాచ్‌లో రాహుల్‌కు మళ్లీ ఆడే అవకాశం ఉంటుందని సూచించాడు. రాహుల్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోందని గంభీర్‌ను ప్రశ్నించగా, అతనిపై విమర్శలు, క్రికెట్ నిపుణులు కూడా అతని గురించి మాట్లాడుతున్నారంటూ టీమిండియా కోచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంభీర్ ఏం చెప్పాడంటే?

గంభీర్ మాట్లాడుతూ "సోషల్ మీడియా ప్లేయింగ్-11ని నిర్ణయించదు. సోషల్ మీడియా లేదా నిపుణులు ఏమనుకుంటున్నారనేది ముఖ్యం కాదు. టీమ్ మేనేజ్‌మెంట్ ఏమనుకుంటుందనేది ముఖ్యం. కాన్పూర్‌లోని కష్టతరమైన పిచ్‌పై అతను మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అవును, అతను ఆడతాడని మాకు తెలుసు. ఈ టీంమేనేజ్‌మెంట్ రాహుల్‌కు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో, వికెట్ కీపర్ రిషబ్ పంత్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, అతను మ్యాచ్‌లో ఆడతాడని గంభీర్ ధృవీకరించాడు.

2016 నుంచి సొంతగడ్డపై సెంచరీ లేదు..

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ కూడా రాహుల్ వెంటే ఉన్నారని గంభీర్ ప్రకటనతో స్పష్టమైంది. కేఎల్ రాహుల్‌కు ఇప్పుడు మరిన్ని అవకాశాలు రానున్నాయి. తన కెరీర్ గురించి మాట్లాడితే, అతను ఇప్పటివరకు 53 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో అతని సగటు 40కి కూడా చేరుకోలేదు. అతను 33.87 సగటుతో 2981 పరుగులు చేశాడు. రాహుల్ అత్యధిక స్కోరు 199 పరుగులు. తన కెరీర్‌లో భారత గడ్డపై సాధించిన ఏకైక సెంచరీ ఇదే. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 2016లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇంగ్లండ్‌పై 199 పరుగులు చేశాడు. అతను తన కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీని కోల్పోయాడు. ఆ తర్వాత రాహుల్ 150 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయాడు.

హోం గ్రౌండ్‌లో రాహుల్ ప్రదర్శన..

రాహుల్ భారత్‌లో 53 టెస్టుల్లో 20 మ్యాచ్‌లు ఆడాడు. అతను 39.62 సగటుతో 1149 పరుగులు చేశాడు. విదేశాల్లో కంటే స్వదేశంలో అతని సగటు ఎక్కువగా ఉంది. కానీ, అతను భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. చెన్నైలో ఏకైక సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 8 ఏళ్లు గడిచినా భారత గడ్డపై సెంచరీ చేయలేదు. అతను 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు 10 సార్లు దాటాడు. కానీ, ఒక్కసారి మాత్రమే మూడు అంకెలను చేరుకోగలిగాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories