KKR vs SRH: ఇవాళ సన్‌రైజర్స్‌, కోల్‌కతా మధ్య క్వాలిఫైయర్స్‌-1

KKR vs SRH 2024, IPL Qualifier 1 Match Today
x

KKR vs SRH: ఇవాళ సన్‌రైజర్స్‌, కోల్‌కతా మధ్య క్వాలిఫైయర్స్‌-1

Highlights

KKR vs SRH: బ్యాటింగ్‌ ఆర్డర్‌లో బలంగా ఉన్న సన్‌రైజర్స్‌

KKR vs SRH: ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క.. ఇన్నాళ్లూ పాయింట్ల కోసం పోరాటం.. ఇవాళ్టి నుంచి అసలు టైటిల్‌ వేట.... ఒకవైపు మెరుపు ఇన్నింగ్స్‌లు, విధ్వంసాలతో టోర్నీలోనే ఊహకందని పర్ఫార్మెన్స్ ఇచ్చిన టీమ్.. మరోవైపు సమతూకంగా ఉన్న టీమ్‌తో నిలకడగా రాణించి ప్లేఆఫ్ చేరిన టీమ్‌.. అహ్మదాబాద్‌ వేదికగా ఐపీఎల్‌ టోర్నీలో కీలక సమరానికి సిద్ధమవుతున్నాయి. ఫైనల్‌కి వెళ్లాలనే కసితో బరిలోకి దిగుతున్న ఈ రెండు జట్లలో క్వాలిఫైయర్ వన్‌లో గెలిచేదెవరు? ఫైనల్‌ పోరుకు ఎంపికయ్యేదెవరు అని క్రికెట్ ఫ్యాన్స్‌ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఆరంభంలోనే విధ్వంసం.. తొలి బంతి నుంచే బౌండరీల మోత.. అలవోకగా 2 వందల పరుగులు.. ఇలా సీజన్‌లోనే హైలైట్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవాళ్టి క్వాలిఫైయర్‌లో ఫేవరెట్‌. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ మెరుపులు, ఆ టీమ్‌ పర్ఫార్మెన్స్‌ చూస్తే కోల్‌కతాకు దీటుగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనర్లు హెడ్, అభిషేక్ దూకుడు ఆ జట్టుకు ప్లస్. మిడిలార్డర్‌లో క్లాసిన్, ఇటీవలే ఫామ్‌లోకి వచ్చిన ఆంధ్రా ఆల్‌రౌండర్‌ నితీష్‌‌తో హైదరాబాద్ జట్టు బలంగా ఉంది. అయితే బ్యాటింగ్‌లో ఉన్న బలం, బౌలింగ్‌‌లో మాత్రం కనిపించడం లేదు. జట్టు భారీ స్కోర్లు సాధించే తప్ప భారీ విజయం ఒక్కటీ లేదు.

ఇక ఆల్‌రౌండ్‌ పర్ఫార్మెన్స్‌తో కోల్‌కతా జట్టు సన్‌రైజర్స్‌ కంటే బలంగా ఉంది. ఓపెనర్ సాల్ట్‌ స్వదేశానికి వెళ్లడం నైట్‌రైడర్స్‌కు మైనస్. అయినా వెంకటేశ్ అయ్యర్, నితీష్‌ రాణా, రింకు, రసెల్‌ లాంటి హిట్టర్లు ఆ జట్టులో ఉండటంతో సాల్ట్ లోటు పెద్దగా ఉండేలా కనిపించడం లేదు. బౌలింగ్‌లోనూ నరైన్, రసెల్, స్టార్క్, వరుణ్ అద్భుతంగా రాణిస్తుండటంతో ఈ జట్టు కూడా ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది.

ఇక ఇప్పటివరకు జరిగిన హెడ్‌ టు హెడ్‌ మ్యాచులు చూస్తే సన్‌రైజర్స్‌పై కోల్‌కతాదే పైచేయి. 17 మ్యాచ్‌ల్లో కోల్‌కతా.. 9 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ గెలిచాయి. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ కోల్‌కతానే గెలిచింది. సన్‌రైజర్స్‌తో గత తొమ్మిది మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ ఏడు మ్యాచులు గెలవగా... ఫైనల్ వేటలో ఏ జట్టు దూసుకెళ్తోంది చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories