Ranji Trohpy: రంజీ ట్రోఫీలో రికార్డు, ఒకే రోజులో 3 ట్రిపుల్ సెంచరీలు..!

Kashyap Bakle Snehal Kauthankar Mahipal Lomror Triple Century in Ranji Trophy Here Know
x

Ranji Trohpy: రంజీ ట్రోఫీలో రికార్డు, ఒకే రోజులో 3 ట్రిపుల్ సెంచరీలు..!

Highlights

Ranji Trohpy: రంజీ ట్రోఫీ చరిత్రలో గురువారం చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ముగ్గురు ఆటగాళ్లు 3 ట్రిపుల్ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించారు.

Ranji Trohpy: రంజీ ట్రోఫీ చరిత్రలో గురువారం చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ముగ్గురు ఆటగాళ్లు 3 ట్రిపుల్ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించారు. అరుణాచల్ ప్రదేశ్‌పై గోవాకు చెందిన కశ్యప్ బక్లే, స్నేహల్ కౌతంకర్ ట్రిపుల్ సెంచరీలు సాధించారు. దీని తర్వాత, ఉత్తరాఖండ్‌పై రాజస్థాన్ తరఫున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు మహిపాల్ లోమ్రోర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. గోవాకు చెందిన కశ్యప్ బక్లే 300 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. స్నేహల్ కౌతంకర్ 314 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 606 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.

ఉత్తరాఖండ్‌పై మహిపాల్ లోమ్రోర్ ట్రిపుల్ సెంచరీ

అదే సమయంలో రాజస్థాన్‌కు చెందిన మహిపాల్ లోమ్రోర్ ఉత్తరాఖండ్‌పై 360 బంతుల్లో 300 పరుగులు చేశాడు. మహిపాల్ లోమ్రోర్ తన ఇన్నింగ్స్‌లో 25 ఫోర్లు, 13 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో మహిపాల్ లోమ్రోర్ అత్యుత్తమ స్కోరు 133 పరుగులు కాగా, ఇప్పుడు అది 300 పరుగులుగా మారింది. ఇటీవల, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిపాల్ లోమ్రోర్‌ను విడుదల చేసింది, అయితే ఇప్పుడు ఐపిఎల్ మెగా వేలానికి ముందు, మహిపాల్ లోమ్రోర్ ట్రిపుల్ సెంచరీ సాధించి తానేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో మహిపాల్ లోమ్రోర్‌ను చేర్చుకోవాలని చాలా జట్లు భావిస్తున్నాయిష. ఇలాంటి పరిస్థితుల్లో మహిపాల్ లోమ్రోర్ పై కాసుల వర్షం కురిపించడం ఖాయం.

గోవా బ్యాట్స్‌మెన్ స్నేహల్ కౌతంకర్, కశ్యప్ బక్లే చరిత్ర

అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్‌పై గోవా బ్యాట్స్‌మెన్ స్నేహల్ కౌతంకర్, కశ్యప్ బక్లే చరిత్ర సృష్టించారు. 300 పరుగులు చేసిన తర్వాత కశ్యప్ బక్లే నాటౌట్‌గా వెనుదిరిగాడు. స్నేహల్ కౌతంకర్ 314 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 606 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. అదే సమయంలో ఈ రికార్డు భాగస్వామ్యం కారణంగా గోవా తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 727 పరుగులు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories