రెండు సార్లు ప్రపంచ కప్ దక్కినట్టే దక్కి న్యూజిలాండ్ జట్టుకి చేయి జారిపోయాయి . ఇక నిన్న జరిగిన ప్రపంచ కప్ లో చివరి ఓవర్ వరకు న్యూజిలాండ్ జట్టుదే విజయం...
రెండు సార్లు ప్రపంచ కప్ దక్కినట్టే దక్కి న్యూజిలాండ్ జట్టుకి చేయి జారిపోయాయి . ఇక నిన్న జరిగిన ప్రపంచ కప్ లో చివరి ఓవర్ వరకు న్యూజిలాండ్ జట్టుదే విజయం అనుకున్నారు అంతా...కానీ ఓ ఓవర్ త్రో మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పింది . చివరి ఓవర్ లో ఆరు బంతులకు 15 పరుగులు అవసరం అన్న నేపధ్యంలో బెయిన్ స్టోక్స్ పరుగు తీస్తూ ఉండగా కివీస్ సారధి విలియమ్సన్ వికెట్ల వైపు తన బంతిని విసిరాడు కానీ అది బెయిన్ స్టోక్స్ బ్యాట్ కి తాకి అలా బౌండరీ వైపు వెళ్ళడంతో ఇంగ్లాండ్ జట్టుకు అదనంగా నాలుగు పరుగులు వచ్చాయి . దీనితో ఇంగ్లాండ్ మ్యాచ్ ని టై చేసేందుకు అది ఉపయోగపడింది. అయితే దీనిపైన విలియమ్సన్ స్పందించాడు . మ్యాచ్ కీలక సమయంలో బంతి అలా తాకి బౌండరీ కి వెళ్ళడం నిజంగా బాధాకరమని ఇలాంటివి భవిషత్తులో జరగకూడదని కోరుకుంటున్నట్లు విలియమ్సన్ తెలిపాడు .
Kane Williamson on England's fortunate four runs: "That was a little bit of shame, wasn't it? Unfortunately, that's the game we play, and that sort of thing happens from time to time."
— Cricket World Cup (@cricketworldcup) July 14, 2019
What a gent 👏#BackTheBlackCaps | #CWC19 pic.twitter.com/4aQLW3Xgbg
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire