Jofra Archer Coronavirus Negative: ఇంగ్లండ్ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌కి కరోనా నెగటివ్.. టెస్ట్ సిరీస్‌కి లైన్‌ క్లియర్

Jofra Archer Coronavirus Negative: ఇంగ్లండ్ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌కి కరోనా నెగటివ్.. టెస్ట్ సిరీస్‌కి లైన్‌ క్లియర్
x
Highlights

Jofra Archer Coronavirus Negative: ఇంగ్లండ్-వెస్టిండ్‌ మధ్య రోజ్ బౌల్ క్రికెట్ గ్రౌండ్‌లో జూలై 8న తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Jofra Archer Coronavirus Negative: ఇంగ్లండ్-వెస్టిండ్‌ మధ్య రోజ్ బౌల్ క్రికెట్ గ్రౌండ్‌లో జూలై 8న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సీరీస్ అన్ని మ్యాచులు బయో సెక్యూర్‌ వాతావరణంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తోంది. ఈ సిరీస్‌కి నెల రోజుల ముందే విండీస్ జట్టుని తమ దేశానికి ఈసీబీ పిలిపించుకుంది. విండీస్‌ ప్లేయర్స్ తో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లకి కూడా కొవిడ్ టెస్టులు నిర్వహించింది. ఇంగ్లండ్ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ కరోనా వైరస్ పరీక్షలో విజయవం అయ్యాడు. ఆర్చర్‌కి రెండోసారి నెగెటివ్‌ రావడంతో వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడే ఇంగ్లండ్ జట్టులో అతను చేరనున్నాడు.

అయితే క్యాంప్ ఇటీవల ప్రారంభమవగా జోప్రా ఆర్చర్ కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో ఉండడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా అతడ్ని క్యాంప్‌కి ఈసీబీ అనుమతించలేదు. ఇటీవల

జోప్రా ఆర్చర్‌కి ఈసీబీ కరోనా వైరస్ టెస్టులు నిర్వహించింది. అందులో నెగటివ్ వచ్చినా గురువారం రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించింది. మరోసారి నెగటివ్ రిపోర్ట్ రావడంతో అతడ్ని ఇంగ్లండ్ టీమ్‌తో చేరేందుకు అనుమతిస్తున్నట్లు ఈసీబీ తెలిపింది.

ఈ నెల 3 నుంచి 23 వరకూ కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 702 పరీక్షలు నిర్వహించగా.. ఎవరికీ వైరస్‌ సోకలేదని ఈసీబీ నిర్ధారించింది. చివరగా ఆర్చర్‌ రిపోర్ట్‌తో సిరీస్‌‌‌కి లైన్ క్లియరైంది. మరోవైపు వెస్టిండీస్ జట్టుకు కరోనా వైరస్ టెస్టులు నిర్వహించినా అందరికి నెగటివ్ వచ్చింది. దాంతో వారు సాధన మొదలెట్టారు.

వెస్టిండీస్‌తో మూడు టెస్టు మ్యాచుల సిరీస్ ఆగేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారని, కరోనా పొంచి ఉన్న నేపథ్యంలో ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని ఇంగ్లండ్‌ టీమ్‌ను ఈసీబీ డైరెక్టర్‌ ఆష్లే జైల్స్‌ గట్టిగా హెచ్చరించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories