Neeraj Chopra: పాత కోచ్‌కు నీరజ్‌ భావోద్వేగ వీడ్కోలు.. కొత్త కోచ్ గా వెటరన్ జావెలిన్ త్రో ప్లేయర్..!

Javelin Legend and World Record Holder Jan Zelezny Becomes Neeraj Chopra New Coach
x

Neeraj Chopra: పాత కోచ్‌కు నీరజ్‌ భావోద్వేగ వీడ్కోలు.. కొత్త కోచ్ గా వెటరన్ జావెలిన్ త్రో ప్లేయర్..!

Highlights

Neeraj Chopra: భారత డబుల్ ఒలింపిక్ పతక విజేత, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కీలక నిర్ణయం తీసుకున్నాడు.

Neeraj Chopra: భారత డబుల్ ఒలింపిక్ పతక విజేత, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కీలక నిర్ణయం తీసుకున్నాడు. నీరజ్ చోప్రా ఇప్పటి వరకు జర్మన్ కోచ్ క్లాస్ బార్టోనిట్జ్‌తో కలిసి పనిచేస్తున్నాడు. కానీ క్లాస్ బార్టోనిట్జ్ ఇటీవలే కోచింగ్ నుండి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు నీరజ్ చోప్రా తన కొత్త కోచ్ పేరును ప్రకటించాడు.

అతను తన కొత్త కోచ్‌గా 3 సార్లు ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన.. సుదీర్ఘమైన జావెలిన్ త్రో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈ అనుభవజ్ఞుడి అనుభవం నీరజ్ చోప్రాకు బాగా ఉపయోగపడబోతోంది. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కొత్త కోచ్‌గా వెటరన్ జాన్ జెలెజ్నీని నియమించాడు. జాన్ జెలెజ్నీ మూడుసార్లు ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్, ప్రస్తుత ప్రపంచ రికార్డ్ హోల్డర్. అతను చాలా కాలంగా చోప్రాకు ఆరాధ్యుడు కూడా.

జాన్ జెలెజ్నీ, 1992, 1996 , 2000 ఒలింపిక్ క్రీడలలో బంగారు పతక విజేత, ఆల్ టైమ్ టాప్ టెన్ బెస్ట్ త్రోలలో ఐదుని కలిగి ఉన్నాడు. 1992, 1996 , 2000 ఒలింపిక్ క్రీడలలో స్వర్ణ పతక విజేత అయిన జెలెజ్నీ, ఆల్ టైమ్‌లోని టాప్ టెన్ బెస్ట్ త్రోలలో ఐదింటిని కలిగి ఉన్నాడు. నాలుగు సార్లు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన ఘనత కూడా సాధించాడు. 1996లో జర్మనీలో 98.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు.

టోక్యో 2020 ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఆ తర్వాత జాకుబ్ వాడ్లెజ్ రజత పతకాన్ని, విటెజ్‌స్లావ్ వెసెలీ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లకు కోచ్ జాన్ జెలెజ్నీ. జాన్ జెలెజ్నీ రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ , మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ బార్బోరా స్పాటకోవాకు కూడా కోచ్‌గా ఉన్నారు. జాన్ జెలెజ్నీ మార్గదర్శకత్వంలో నీరజ్ తన సాంకేతిక నైపుణ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి.. ఆ సరికొత్త విజయాలను సృష్టించడానికి ఆసక్తిగా ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories