Jasprit Bumrah: టీమ్ ఇండియాకు ఆరు నెలల పాటు దూరం కానున్న జస్ప్రీత్ బుమ్రా.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం డౌటే..!

Jasprit Bumrah: టీమ్ ఇండియాకు ఆరు నెలల పాటు దూరం కానున్న జస్ప్రీత్ బుమ్రా.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం డౌటే..!
x

Jasprit Bumrah: టీమ్ ఇండియాకు ఆరు నెలల పాటు దూరం కానున్న జస్ప్రీత్ బుమ్రా.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం డౌటే..!

Highlights

Jasprit Bumrah: జనవరి 12 నాటికి ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే అందులో జస్ప్రీత్ బుమ్రా పేరు ఉంటుందా లేదా అనేది ప్రతి ఒక్కరి మదిలో మెదిలే పెద్ద ప్రశ్న.

Jasprit Bumrah: జనవరి 12 నాటికి ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే అందులో జస్ప్రీత్ బుమ్రా పేరు ఉంటుందా లేదా అనేది ప్రతి ఒక్కరి మదిలో మెదిలే పెద్ద ప్రశ్న. జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడా? అతని గాయానికి సంబంధించిన పరిస్థితి ఇంకా స్పష్టంగా తెలియనందున ఈ ప్రశ్న ఇప్పుడు తీవ్రమైంది. అతను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం లేదా ఆడకపోవడం అతని గాయం స్థితిని బట్టి ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా సిడ్నీ టెస్ట్ సమయంలో వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఆ తర్వాత అతను గేమ్‌ను మధ్యలోనే వదిలేసి మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరిగి రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న ఆడనుంది. అయితే అప్పటికి బుమ్రా ఫిట్‌గా ఉంటాడా అనేది పెద్ద ప్రశ్న.

బుమ్రాకు చికిత్స చేస్తున్న వైద్యులు టీమ్ మేనేజ్‌మెంట్ చెబుతున్నట్లుగా ఇది వెన్ను నొప్పి మాత్రమే అయితే, బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఫిట్‌గా ఉంటాడని అంటున్నారు. కానీ, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మరికొన్ని నివేదికల ప్రకారం, పెద్ద గాయం అయితే కొంతకాలం జట్టుకు దూరంగా ఉండవలసి ఉంటుంది. ఫ్రాక్చర్ లేకపోతే జనవరి చివరి నాటికి బుమ్రా తిరిగి గ్రౌండ్ లోకి తిరిగి ఎంట్రీ ఇస్తాడు. అతను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం చూడవచ్చు.

ఇక బుమ్రా ఎప్పుడు రంగంలోకి దిగుతాడో చూడాలి. అయితే అతను ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌లో ఆడడం లేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమవుతాడా? మరి, అతను 6 నెలల పాటు అవుట్ అయితే, అతను ఐపీఎల్ 2025లో ఆడతాడా లేదా? ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో మాత్రమే తన రీఎంట్రీ అభిమానులు చూడగలరా? అనే ప్రశ్నలకు మరికొన్ని రోజుల్లో అధికారికంగా సమాధానాలు రావచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories