Ind vs Aus: మరోసారి విధ్వంసం సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. అదే సిరీస్‌లో మూడోసారి అరుదైన ఫీట్..!

Jasprit Bumrah Creates Havoc Once Again in Ind vs Aus Test
x

Ind vs Aus: మరో సారి విధ్వంసం సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. అదే సిరీస్‌లో మూడోసారి అరుదైన ఫీట్..!

Highlights

Ind vs Aus: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో జస్ప్రీత్ బుమ్రాను ఆపడం ఆస్ట్రేలియా జట్టుకు అసాధ్యంగా మారింది.

Ind vs Aus: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో జస్ప్రీత్ బుమ్రాను ఆపడం ఆస్ట్రేలియా జట్టుకు అసాధ్యంగా మారింది. ఈ సిరీస్‌లోని ప్రతి మ్యాచ్‌లోనూ అతడు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో కూడా అలాంటిదే కనిపించింది. పెర్త్, గబ్బా వంటి మెల్‌బోర్న్‌లోనూ విధ్వంసం సృష్టించాడు. జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ కారణంగా మెల్బోర్న్ రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 234 పరుగులకు ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్ ఇప్పుడు 340 పరుగులు చేయాల్సి ఉంది.

మెల్‌బోర్న్‌లో జస్ప్రీత్ బుమ్రా విధ్వంసం

మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా నలుగురు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. అతను రెండవ ఇన్నింగ్స్‌లో మరింత సక్సెస్ అయ్యాడు. మొత్తం ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లను ఫెవీలియన్ కు పంపారు. అంటే ఈ టూర్ లో మరోసారి బౌలింగుతో తన పంజా విప్పాడు. మెల్‌బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 24.4 ఓవర్లు బౌలింగ్ చేసి 57 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అతను సామ్ కాన్స్టాస్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ, నాథన్ లియాన్‌ల వికెట్లను తీశాడు. దీంతో బుమ్రా ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడం సిరీస్‌లో ఇది మూడోసారి. ఇవి కాకుండా తన టెస్టు కెరీర్‌లో 13వ సారి ఈ ఘనత సాధించాడు.

పెర్త్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ పర్యటనను మొదలు పెట్టాడు. ఆ తర్వాత అడిలైడ్ టెస్టులో 4 వికెట్లు తీశాడు. ఆ తర్వాత గబ్బా టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు అతని ఫామ్ మెల్‌బోర్న్‌లో కూడా కొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ సిరీస్‌లో 30 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం బుమ్రా తప్ప మరే ఇతర బౌలర్ కూడా 20 వికెట్ల స్కోరును అందుకోలేకపోయాడు.

ఆస్ట్రేలియాలో బుమ్రాదే ఆధిపత్యం

ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా 9 వికెట్లు తీయడం ఇది మూడోసారి. అంతకుముందు ఈ ఏడాది గబ్బాలో, 2018లో మెల్‌బోర్న్‌లో ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బుమ్రా తప్ప మరే ఇతర భారత ఫాస్ట్ బౌలర్ కూడా 9 వికెట్లు తీయలేకపోయాడు. అదే సమయంలో బుమ్రా మాత్రమే ఇలా మూడు సార్లు చేయగలిగాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories