Cricket: భారత్ – పాక్ పోరు.. ఎండ్ కార్డ్ పడిందా..??

Is the End Card of The India Pak War
x

Cricket: భారత్ – పాక్ పోరు.. ఎండ్ కార్డ్ పడిందా..??

Highlights

* భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచమే చూస్తుంది. ఈ రెండు జట్లు చివరి సారిగా 2007లో టెస్టు సిరీస్ ఆడాయి. ఆ తర్వాత భద్రతా కారణాల రీత్యా టెస్ట్ సిరీస్ రద్దయింది.

Cricket: దాయాదుల మధ్య పోరు అంటే ఆ క్రేజ్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. చిరకాల ప్రత్యర్థులు తలపడుతుంటే చూడాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరిక. అయితే ఇది ఇప్పట్లో నెరవేరలా లేదు.. భారత్-పాకిస్తాన్ సిరీస్ పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సమీప భవిష్యత్ లో కూడా సిరీస్ ఉంటుందని భావించే ఛాన్సులు కూడా కనిపించడం లేదు.

పీసీబీ అధ్యక్షుడు నజమ్ సేథీ.. భారత్-పాక్ టెస్ట్ సిరీస్ ను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లేదంటే సౌతాఫ్రికాలో నిర్వహించాలని బీసీసీఐకి ప్రతిపాదించారు. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ పాక్ క్రికెట్ చీఫ్ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. తటస్థ వేదికపై టెస్ట్ సిరీస్ నిర్వహించే ప్రసక్తే లేదని బీసీసీఐ క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు, సమీప భవిష్యత్ లో కూడా భారత్-పాక్ సిరీస్ జరిగే అవకాశం లేదని తేల్చి చెప్పింది.

ఆసియా కప్ 2023 వేదిక విషయంలో భారత్, పాక్ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. భద్రతా కారణాల రీత్యా టీమిండియా పాక్ లో అడుగుపెట్టదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, దీనికి ప్రతిగా పాక్ బోర్డు కూడా అంతే స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ లో పాక్ అడుగుపెట్టదని తెగేసి చెప్పింది. ఆసియా కప్ మ్యాచ్ లను భారత్ తటస్థ వేదికలపై ఆడాలనుకుంటే...వరల్డ్ కప్ లోనూ తమ మ్యాచ్ లను తటస్థ వేదికలపైనే నిర్వహించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది.

ఇటు బీసీసీఐ అటు పీసీబీ రెండు బోర్డులు తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నాయి. నిజానికి భారత్ – పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య చాలా సంవత్సరాలుగా సఖ్యత లేదు. దీంతో ఆసియా కప్ నిర్వహణ పై సందిగ్థత నెలకొంది. ఇదిలా ఉంటే, వరల్డ్ కప్ కోసం తమ జట్టుకు తటస్థ వేదికలు సిద్ధం చేయాలని చెప్పడంపై ఐసీసీ ఆగ్రహంగా ఉంది. లిస్ట్ లోని పది జట్లు తప్పకుండా తాము నిర్ణయించిన వేదికల్లోనే మ్యాచ్ లు ఆడాలని స్పష్టం చేస్తోంది. ఒకవేళ అతిక్రమిస్తే భారీ జరిమానా తప్పదని హెచ్చరిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories