ప్రపంచ కప్ లో పరుగుల ప్రవాహమేనా?

ప్రపంచ కప్ లో పరుగుల ప్రవాహమేనా?
x
Highlights

వన్డే క్రికెట్ అంటేనే బ్యాట్స్ మెన్ కు పండగ. వేగంగా పరుగులు చేసి రికార్డులు నమోదు చేయాలని ఉవ్విళ్ళూరుతారు. ఒకపుడు వన్డేల్లో 250 స్కోరు చేస్తే.. ఛేదన...

వన్డే క్రికెట్ అంటేనే బ్యాట్స్ మెన్ కు పండగ. వేగంగా పరుగులు చేసి రికార్డులు నమోదు చేయాలని ఉవ్విళ్ళూరుతారు. ఒకపుడు వన్డేల్లో 250 స్కోరు చేస్తే.. ఛేదన కష్టమే అనేవారు. తరువాత అది 300 కి చేరింది. కొన్నాళ్ళకు 350 కూడా కష్టమైనా స్కోరుగా కనిపించలేదు. ఇపుడు 400 దాటినా ఛేదన చేయడం కష్టమేమీ కాదన్నట్టున్నాయి పరిస్థితులు. వరల్డ్ కప్ అంటే పరుగుల ప్రవాహానికి కొదువ లేకుండా ఉండేలా పిచ్ లు ఉంటాయి. సాధారణంగా బ్యాటింగ్ పిచ్ లే ఉంటాయి. వాటి మీద బ్యాటింగ్ వీరులు రెచ్చిపోతుండడం సహజమే. 2018 లో ఇపుడు ప్రపంచ కప్ నిర్వాహక దేశమైన ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా పై 481 పరుగులు చేసి సంచలనం సృష్టించింది. దీంతో క్రికెట్ అభిమానులు ఇపుడు ప్రపంచ కప్ లో 500 పరుగులు కచ్చితంగా చూస్తామని నమ్ముతున్నారు. 300 పరుగులు చేస్తే సాధారణ స్కోరుగా కనిపిస్తోందిప్పుడు. 400 పరుగులు బోర్డు మీదుంటే ఆ కిక్కే వేరన్నట్టు ఆడుతున్నారు. ఈ మధ్యనే ముగిసిన ఇంగ్లాండ్, పాకిస్థాన్ వన్డే సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు 373 పరుగులు ఓ మ్యాచ్ లో చేసినిది.. దానికి ప్రతిగా పాక్ కూడా 361 పరుగుల వరకూ చేరుకోగలిగింది. తరువాత వన్డేలోనే పాక్ 350 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ 351 పరుగులు సునాయాసంగా చేసింది. ఈ ఉదాహరణలు చాలు రాబోయే ప్రపంచ కప్ లో పిచ్ లు బ్యాట్స్ మెన్ కు స్వర్గ ధామం లా ఉంటాయని చెప్పడానికి. ఈ గణాంకాలను బట్టి చూస్తే, వరల్డ్ కప్ లో 300 పరుగులు కొద్ద సురక్షితమైన స్కోరు కాదు మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకి అనిపిస్తోంది.

300 - 350 - 400 - 450 ఇలా స్కోర్లు చూసేసాం. ఇక ఈ ప్రపంచ కప్ లో 500 బోర్డు మీద కనపడతామా ఖాయమనే భావించాలి. ఎదుకంటే, టీ 20 ల్లో విపరీతంగా పరుగులు చేసేసి.. ఫామ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ ప్రతి టీములోనూ ఉన్నారు. ఇక్కడ అదే ఫామ్ వారు కొనసాగిస్తే.. ఇదేమంత కష్టం కాదు. హాట్ ఫేవరేట్ ఇంగ్లాండ్ లో దాదాపుగా 6 గురు అరివీరభయంకర బ్యాట్స్ మెన్ ఉన్నారు. వారేంత ఒక్కసారిగా విరుచుకుపడితే 500 మార్క్ కష్టమే కాదు. ఇక టీమిండియా లోనూ డబుల్ సెంచరీ వీరులు.. బంతి కనబడకుండా బౌండరీ దాటించగలిగిన ధీరులూ ఉన్నారు.. అదేవిధంగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టీముల్లోనూ కసిగా బయటింగ్ చేసే వారున్నారు. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే 500 కష్టం కాకపోవచ్చు. కాకపోతే ఈ ఘనతను అందుకునే దేశం ఏదవుతుందన్నదే ఇపుడు అందరికీ ఉన్న ప్రశ్న. అన్నట్టు మ్యాచ్ ముగిసాకా ప్రేక్షకులకు స్కోరు కార్డులు అందిస్తారు నిర్వాహకులు. ఆ స్కోరు కార్డుల్లో ఇప్పటి వరకూ 400 పరుగులే ముద్రించి ఉండేవి. ఇపుడు ఇంగ్లాండ్ లో కప్ నిర్వాహకులు 500 పరుగులు ముద్రించిన స్కోరు కార్డులు తయారు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories