IPL Auction 2021: నయావాల్‌కు లక్కీ ఛాన్స్.. ఎట్టకేలకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం

Cheteshwar Pujara Bought By Chennai Super Kings
x

పుజారా ఐపీఎల్ 2021

Highlights

IPL Auction 2021 టీమిండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా ఎట్టకేలకు ఐపీఎల్ అడే అవకాశం వరించింది.

IPL Auction:ఐపీఎల్2021‌ వేలంలో విదేశీ ఆటగాళ్లు కోట్ల రూపాయాలను ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌ వేలానికి విరామం ప్రకటించారు. రెండో సెషన్ మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. ఇంతకుుందు వేలంలో టీమిండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా ఎట్టకేలకు ఐపీఎల్ అడే అవకాశం వరించింది. దీంతో ఇతను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతడిని కనీస ధర 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. చెన్నై పుజారా దక్కించుకున్నాక ఫ్రాంచైజీలన్నీ చప్పట్లతో అభినందనులు తెలిపాయి. తమిళనాడు ఫినిషర్‌ షారుక్‌ ఖాన్‌ అదృష్టం వరించింది. రూ.5.25 కోట్లు పెట్టి పంజాబ్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది. కర్ణాటక ఆఫ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కృష్ణప్ప గౌతమ్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతడిని రూ.9.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

ఆసీస్‌ పేసర్‌ నేథన్‌ కౌల్టర్‌ నైల్‌ను ముంబయి రూ. 5 కోట్లు దక్కించుకుంది. కనీస ధర రూ.1.5 కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలకు చేరుకోవడం విశేషం. టీమ్‌ఇండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను రూ.1కోటీ రూపాయలకే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ముంబయి పియూష్‌ చావ్లాకు రూ.2.4 కోట్లులకు కొనుగోలు చేసింది. సౌరాష్ట్ర ఎడమచేతి వాటం యువ పేసర్‌ చేతన్‌ సకారియాను లక్ కలిసోచ్చింది. రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని రూ.1.2 కోట్లకు దక్కించుకుంది. ఆస్ట్రేలియా యువపేసర్ మెరెడిత్‌ను పంజాబ్‌ కింగ్స్‌ అతడిని రూ.8 కోట్లుకు దక్కించుకుంది.

కైల్‌ జేమిసన్‌ను బెంగళూరు రూ.15 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌ కూడా అతడి కోసం పోటీ పడింది. అతడి కోసం రూ.14.75 కోట్ల వరకు కింగ్స్ బిడ్‌ దాఖలు చేసింది. జేమిసన్‌ ధర పలకడం విశేషం. ఇంగ్లాండ్‌ ఆటగాడు టామ్‌ కరన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. క్యాపిటల్స్‌ రూ.5.25 కోట్లకు దక్కించుకుంది. మోజెస్‌ హెన్రిక్స్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.4.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌, అఫ్గాన్‌ మిస్టరీ స్పిన్నర్‌ ముజీబ్‌, టీమిండియా స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. కివీస్‌ స్పిన్నర్‌ ఇష్‌ సోదీని కూడా కొనుగోలు చేయలేదు

Show Full Article
Print Article
Next Story
More Stories