IPL 2025: నవంబర్ 24, 25తేదీల్లో ఐపీఎల్ వేలం.. వీరిద్దరి ధర మరీ ఇంత తక్కువనా ?

IPL 2025 Mega Auction Sarfaraz Khan Prithvi Shaw Base Price Only Lakhs 15 Indian Players 2 Crores
x

IPL 2025: నవంబర్ 24, 25తేదీల్లో ఐపీఎల్ వేలం.. వీరిద్దరి ధర మరీ ఇంత తక్కువనా ?

Highlights

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ అంటే 18వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం నిర్వహించాల్సి ఉంది.

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ అంటే 18వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం నిర్వహించాల్సి ఉంది. ఈసారి ఐపీఎల్ వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. వేలం తేదీలను ప్రకటించారు. ఈ వేలం కోసం 1500 మందికి పైగా ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.

ఐపీఎల్ 2025 వేలం నవంబర్ 24, 25 తేదీలలో జరుగుతుంది. మెగా వేలం కోసం నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 1,165 మంది భారతీయులు, 409 మంది విదేశీయులు ఉన్నారు. నమోదు చేసుకున్న మొత్తం ఆటగాళ్లలో 320 క్యాప్డ్ (అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వారు), 1,224 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు ఉన్నారు. ఇది కాకుండా, 30 అసోసియేట్ దేశాల నుండి ఆటగాళ్లు కూడా మెగా వేలం కోసం నమోదు చేసుకున్నారు.

ఒకవైపు భారత ఆటగాళ్లు చాలా మంది తమ బేస్ ధరను రూ.2 కోట్ల వద్దే ఉంచుకున్నారు. అయితే సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా వంటి స్టార్ ప్లేయర్లు తమ బేస్ ధరను రూ.75 లక్షల వద్ద మాత్రమే ఉంచారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల బేస్ ప్రైస్ అందరనీ ఆశ్చర్యపరుస్తోంది. అలాగే ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, వెంకటేష్ అయ్యర్, అవేష్ ఖాన్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్మద్ సిరాజ్, ఉమేష్మద్ సిరాజ్ లాంటి వారు కూడా తన ధరలను బేస్ ప్రైజ్ వద్దే ఉంచుకున్నారు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో 204 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేస్తారు. మొత్తం 10 ఐపీఎల్ జట్లలో మొత్తం 204 స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి జట్లు వేలం వేస్తాయి. ఈ విధంగా నమోదు చేసుకున్న మొత్తం 1,574 మంది ఆటగాళ్లలో 204 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయనున్నారు. ఒక ఫ్రాంచైజీ గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయగలదు.

ఐపీఎల్ 2025 వేలం కోసం ఏ దేశం నుండి ఎంత మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు?

ఆఫ్ఘనిస్తాన్ - 29 మంది ఆటగాళ్లు

ఆస్ట్రేలియా - 76 మంది ఆటగాళ్లు

బంగ్లాదేశ్ - 13 మంది ఆటగాళ్లు

కెనడా - 4 ఆటగాళ్లు

ఇంగ్లండ్ - 52 మంది ఆటగాళ్లు

ఐర్లాండ్ - 9 మంది ఆటగాళ్లు

ఇటలీ - 1 ఆటగాడు

నెదర్లాండ్స్ - 12 మంది ఆటగాళ్లు

న్యూజిలాండ్ - 39 మంది ఆటగాళ్లు

స్కాట్లాండ్ - 2 ఆటగాళ్లు

దక్షిణాఫ్రికా - 91 మంది ఆటగాళ్లు

శ్రీలంక - 29 మంది ఆటగాళ్లు

UAE- 1 ఆటగాడు.

USA- 10 మంది

వెస్టిండీస్ - 33మంది

జింబాబ్వే- 8 మంది

Show Full Article
Print Article
Next Story
More Stories