IPL Auction 2025: కావ్య పాప ఇలా చేసిందేంటి?.. సుదీర్ఘ అనుబంధం తెగిపాయె!

Kavya Maran
x

Kavya Maran

Highlights

IPL Auction 2025: సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఐపీఎల్ 2025 మెగా వేలం రెండో రోజు జరుగుతోంది. వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్‌ భువనేశ్వర్ కుమార్‌ భారీ ధర పలికాడు.

IPL Auction 2025: సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఐపీఎల్ 2025 మెగా వేలం రెండో రోజు జరుగుతోంది. వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్‌ భువనేశ్వర్ కుమార్‌ భారీ ధర పలికాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) భువీని రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. భువనేశ్వర్ కనీస ధర రూ.2 కోట్లు కాగా.. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి. తగ్గేదేలే అన్నట్లుగా రూ. 9 కోట్ల వరకు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే ముంబై పోటీ నుంచి తప్పుకోగా.. మధ్యలో వచ్చిన ఆర్సీబీ అతడిని ఎగరేసుకుపోయింది. ఐపీఎల్ 2025లో బెంగళూరుకు భువీ ఆడనున్నాడు. అయితే భువనేశ్వర్ ఆక్షన్‌కు వచ్చిన సమయంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం విశేషం.

స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్‌ కుమార్‌ 2011లో ఐపీఎల్‌ టోర్నీలో అడుగుపెట్టాడు. తొలి సీజన్‌లో పుణె వారియర్స్‌ తరఫున ఆడాడు. 2013లో 13 వికెట్లు సత్తాచాటాడు. 2014లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ భువీని కోలుగోలు చేసింది. హైదరాబాద్ తరఫున 2016లో భువీ 23 వికెట్లతో చెలరేగి.. జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ఫామ్ కొనసాగిస్తూ 2017లో 26 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాతి సీజన్‌ నుంచి 20 వికెట్ల మార్కు అందుకోలేకపోయాడు. వికెట్స్ ఎక్కువగా తీయకున్నా.. పరుగులు మాత్రం తక్కువే ఇచ్చాడు. ఇక ఐపీఎల్ 2025కి ముందు సన్‌రైజర్స్‌ అతడిని వదిలేసింది. అంతేకాదు 2025 వేలంలో కూడా అతడిని కొనుగోలు చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు.

భువనేశ్వర్‌ కుమార్‌ను తీసుకోకపోవడంపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'కావ్య పాప ఇలా చేసిందేంటి?' ట్వీట్ చేయగా.. 'భువీతో సుదీర్ఘ అనుబంధం తెగిపాయె' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'నిన్ను కచ్చితంగా మిస్‌ అవుతాము భువీ', 'ఆల్ ది బెస్ట్ భువనేశ్వర్‌' అంటూ ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు భువనేశ్వర్‌ 176 ఐపీఎల్‌ మ్యాచ్‌లలో 181 వికెట్లు తీశాడు. అతడి అత్యుత్తమ గణాంకాలు 5/19. ఇక భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు మంచి ధర పలికింది. అతడి కనీస ధర రూ.2 కోట్లు కాగా.. బెంగళూరు రూ.5.75 కోట్లకు తీసుకుంది. లియామ్ లివింగ్‌స్టొన్, జితేష్ శర్మ, ఫిల్ సాల్ట్, జోష్ హేజిల్‌వుడ్‌లను బెంగళూరు మొదటిరోజు తీసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, యష్ దయాళ్ లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరు జట్టు బలంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories