IPL 2024 Auction: ఐపీఎల్‌-2024 వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడు.. ఎక్కడంటే?

IPL 2024 Player Auction to take place on December 19 in Dubai
x

IPL 2024 Auction: ఐపీఎల్‌-2024 వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడు.. ఎక్కడంటే?

Highlights

IPL 2024 Auction: తొలిసారి విదేశంలో ఐపీఎల్ ఆక్షన్

IPL 2024 Auction: ఐపీఎల్‌-2024 సీజన్‌ మినీ వేలానికి ముహూర్తం ఖరారైంది. తొలిసారి భారత్‌లో కాకుండా బయట దేశంలో ఐపీఎల్ ఆక్షన్ జరగనుంది. డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా వేలం జరగనుంది. ఇందుకోసం ఈవెంట్‌లో భాగమయ్యే 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను నవంబర్ 26 నాటికి ఐపీఎల్ కమిటీకి సమర్పించాలి. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ గెయింట్స్ టీమ్.. తమ పేసర్ రొమారియా షెపర్డ్‌ను ముంబైకి ట్రేడ్ చేసింది.

ఇక ఈ సారి పర్స్ విలువను 5 కోట్లు పెంచారు. వేలంలో ఒక్కో ఫ్రాంచైజీ పర్స్‌ విలువను 5 కోట్లు పెంచాలని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో ఆయా ఫ్రాంచైజీల పర్స్‌ వాల్యూ 95 కోట్లగా ఉండగా.. ఈ ఏడాది 100 కోట్లకు చేరనుంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఖాతాలో అత్యధికంగా 12 కోట్ల 20 లక్షలున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దగ్గర 6 కోట్ల 55 లక్షలు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ దగ్గర 4 కోట్ల 45 లక్షలు.. లక్నో సూపర్‌ గెయింట్స్‌ దగ్గర 3 కోట్ల 55 లక్షలున్నాయి. అత్యల్పంగా ముంబై ఇండియన్స్ దగ్గర 5 లక్షలు మాత్రమే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories