IPL 2021: సన్‌రైజర్స్‌ దే టైటిల్! లెక్కలు వేసి మరీ చెబుతున్న ఫ్యాన్స్

IPL 2021: సన్‌రైజర్స్‌ దే టైటిల్! లెక్కలు వేసి మరీ చెబుతున్న ఫ్యాన్స్
x
Highlights

IPL 2021: 2016 ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించిన రెండు జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌.

IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 2021 క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. ప్రేక్షకులు గ్రౌండ్‌లో లేకపోయినా..ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. దీంతో క్రికెట్ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోతున్నారు. చెన్నై వేదికగా శనివారం మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. చెపాక్ మైదానంలో ముంబై ఇండియన్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే హైదరాబాద్ ఈ సారి కప్ సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లు ఓ లెక్కలు కూడా చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

2016 ఐపీఎల్‌ సీజన్‌ విజేతగా సన్‌రైజర్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మీద అంచనాలు ఎప్పుడూ లేవు. ఈ ఏడాది కూడా అంతే. కానీ గణాంకాలు మాత్రం ఓ తమాషాను చూపిస్తున్నాయి. ఈ ఏడాది కప్‌ నెగ్గే సూచనలివే అంటున్నాయి. డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలో ఆ ఏడాది సన్‌రైజర్స్‌ జట్టు అలరించింది. అయితే ఆ సీజన్‌లో ఆట అనుకున్నంత సులువుగా సాగలేదు. మొదట రెండు మ్యాచుల్నీ ఓడిపోయారు. మూడో మ్యాచ్‌లో నెగ్గి దూసుకుపోయారు. ఈ ఏడాది కూడా తొలి రెండు మ్యాచులు ఓడిపోయారు. అదే విధంగా ఈ సారి కూడా రాణిస్తారని చెప్పుకొస్తున్నారు.

2016 ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించిన రెండు జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌. 2021 సీజన్‌లో కూడా మొదటి రెండు మ్యాచులూ ఈ జట్ల చేతిలోనే ఓడిపోయారు. 2016లో ముంబైతో ఆడి విజయం సాధించారు. ఈ సారి కూడా మూడో మ్యాచ్ ముంబైతో జరగనుంది. ఈ మ్యాచ్ విజయం సాధిస్తే ఈ సారి కూడా టైటిల్ సాధిస్తుందని అభిమానులు అంటున్నారు. అయితే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ను ఓడించి మరో విజయం తమ ఖాతాలో వేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది.

ఈ మ్యాచ్‌లో ముంబై సారథి రోహిత్ ముగింట మరో అద్భుతమైన రికార్డ్ నిలిచివుంది. ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ పోరులో రోహిత్‌ ఇంకో 28 పరుగులు చేస్తే, టీ20ల్లో కెప్టెన్‌గా 4వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించనున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో హిట్‌మ్యాన్‌ ఇప్పటి వరకు 202 మ్యాచ్‌ల్లో 5292 పరుగులు పూర్తి చేశాడు. అత్యధిక స్కోరు 109 కాగా, 39 అర్ధశతకాలు నమోదు చేశాడు. గత రెండు మ్యాచుల్లో బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమైన ఓపెనర్, బ్యాట్స్ మెన్ సాహా ని తప్పించాలనే ఆలోచనలో యాజమాన్యం ఉందని తెలుస్తోంది. సాహా స్థానంలో కేదర్ జాదవ్ ఆడించాలని భావిస్తోంది. నబీ స్థానంలో హోల్డర్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ లో విలియమ్స్‌న్ ఆడే అవకాశాలు లేవు.

Show Full Article
Print Article
Next Story
More Stories