IPL 2021: కాసేపట్లో బిగ్ ఫైట్..గెలుపే లక్ష్యం! RR Vs KKR..తుది జట్లు ఇవే!

Indian Premier League 2021
x

RR Vs KKR

Highlights

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్ ఆరంభంలో జోరు చూపించిన రాజస్థాన్, కోల్‌కతా జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి.

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్ ఆరంభంలో జోరు చూపించిన రాజస్థాన్, కోల్‌కతా జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. శనివారం రాత్రి జరిగే లీగ్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండు జట్లు కలిసి చెరో నాలుగేసి మ్యాచ్‌లు ఆడియి. చెరోక విజయం సాధించి గెలిచి మూడింటిలో ఓడాయి. దాంతో ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి గాడిలో పడాలని కోల్‌కతా, రాజస్థాన్ భావిస్తున్నాయి. కోల్‌కతా గత మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. రస్సెల్, కమిన్స్, దినేశ్ కార్తీక్ చెలరేగడంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఇదే జోరును కొనసాగిస్తూ రాజస్థాన్‌ పైచేయి సాధించాలని భావిస్తోంది. మరోవైపు గత మ్యాచ్‌లో బెంగళూరుపై చిత్తుగా ఓడిన రాజస్థాన్ ఈ సారి తప్పిదాలను సరిదిద్దుకోవాలని యోచిస్తుంది.

రెండు జట్ల బలాబలాలు

ఈ మ్యాచ్ లో పేపర్ మీద బలంగా కనిపిస్తున్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు, మూడు మ్యాచులుగా గెలుపు మొహం చూడని రాజస్థాన్ టీంకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. వాంఖడే వేదిక మరో బిగ్ ఫైట్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. నేడు ఇరు జట్లు మరో హోరాహోరి పోరుకు సిద్ధమైయ్యాయి. అయితే రెండు జట్ల బలాబలాలు ఎంటో మనం చూద్దాం.

కోల్‌కతా నైట్‌రైడర్స్

బ్యాటింగ్ విషయానికి వస్తే.. తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ సమష్టిగా రాణించడంలో విఫలమవుతోంది. అయితే ఓపెనింగ్‌లో గిల్, రాణా నుంచి మంచి ఆరంభం లభించడం లేదు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వైఫల్యం కూడా టీమ్‌పై ప్రభావం చూపిస్తున్నది. మరోవైపు స్టార్ పేసర్ కమిన్స్ బ్యాట్స్‌మెన్‌గా ఆకట్టుకోవడం జట్టుకు అదనపు ప్రయోజనం. రస్సెల్, కార్తీక్ ఫామ్‌లోకి రావడం మంచి పరిణామం. ఈ ఇద్దరిలో ఒకరు రాణిస్తే మరొకరు విఫలమవుతున్నారు.

బౌలింగ్ విషయానికి వస్తే..ఆఖరి ఓవర్స్‌లో కేకేఆర్ బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. వరుణ్ చక్రవర్తీ, ప్రసిధ్ కృష్ణ కీలక సమయంలో చేతులేత్తేస్తున్నారు. దీంతో చేజింగ్‌లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించుకుంటే కోల్ కతా విజయం సాధించవచ్చు. కమలేష్ నాగర్ కోటి, శివం మావీలో ఒకరికి అవకాశం దక్కవచ్చు.

రాజస్థాన్

మరోవైపు రాజస్థాన్‌ జట్టు పరిస్థితి కూడా ఇలానే ఉంది. బెంగళూరు చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడటం టీమ్ కాన్షిడెన్స్‌ను దెబ్బతీసింది. రాజస్థాన్ రాయల్స్‌పై సెంచరీ కొట్టిన శాంసన్ మళ్లీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఓపెనర్లు బట్లర్, మనన్ వోహ్రా నిరాశపరుస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పుకొదగ్గ ఫర్మామెన్స్ ఇవ్వలేదు. ఇక మిల్లర్ ఫామ్‌లేమి వైఫల్యాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నది. బ్యాటింగ్‌తో పాటు రాయల్స్ బౌలింగ్ కూడా ఆందోళనకరంగానే ఉంది.

ఇక మోరిస్‌తో పాటు ముస్తాఫిజుర్ ప్రభావం చూపడం లేదు. ప్రత్యర్థి జట్టకు అప్పనంగా పరుగులు ఇస్తున్నారు. గత సీజన్ లో అదరగొట్టిన ఆర్చర్, స్టోక్స్ లేకపోవడం అతిపెద్ద లోటుగా కనిపిస్తున్నది. తుది జట్టులో మార్పలు జరగవచ్చు. గత నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన మనన్ వోహ్రాపై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో యువ హిట్టర్ యశస్వి జైస్వాల్‌కు అవకాశం రావచ్చు. ముస్తాఫిజుర్‌కు బదులు ఆండ్రూ టైని తీసుకునే అవకాశాలు.

ముఖాముఖి పోరు:

రెండు జట్లు ఇప్పటి వరకు 23 మ్యాచ్‌ల్లో తలపడగా..కోల్‌కతా నైట్‌రైడర్స్ 12 విజయాలతో పైచేయి సాధించింది. రాజస్థాన్ మాత్రం 10 విజయాలతో సరిపెట్టుకోగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. గత ఏడాది యూఏఈలో జరిగిన టోర్నీలో రెండు సార్లు విజయం వరించింది. వాంఖడే మైదానంలో కోల్‌కతాకు మెరుగైన రికార్డు లేకపోవడం రాజస్థాన్‌కు కలిసొచ్చే అంశం. ఈ మైదానంలో జరిగిన 9 మ్యాచ్‌ల్లో కేకేఆర్ ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందింది.

తుది జట్లు(అంచనా):

కోల్‌కతా నైట్‌రైడర్స్:

ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), నితీష్ రాణా, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్(కీపర్), ఆండ్రీ రస్సెల్, ప్యాట్ కమిన్స్, కమలేష్ నాగర్‌కోటి/శివం మావి, వరుణ్ చక్రవర్తీ, ప్రసిధ్ కృష్ణ

రాజస్థాన్ రాయల్స్:

సంజూ శాంసన్(కెప్టెన్), జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, శివమ్ దూబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరీస్, జయదేవ్ ఉనాద్కత్, చేతన్ సకారియా, ఆండ్రూ టై

Show Full Article
Print Article
Next Story
More Stories