IPL 2021 RR vs SRH: నేడు రాజస్థాన్ తో హైదరాబాద్ ఢీ; రికార్డులివే

IPL 2021 Rajasthan Royals vs Sunrisers Hyderabad, 28th Match Preview
x

ఆర్ఆర్ తో హైదరాబాద్ ఢీ (ఫొటో ట్విట్టర్)

Highlights

IPL 2021 RR vs SRH: ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు మొదటి మ్యాచ్ లో ఆర్ఆర్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.

IPL 2021 RR vs SRH: ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు (ఆదివారం) మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ అరుణ్ జెట్లీ స్టేడియం, ఢిల్లీలో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 6 మ్యాచ్‌లు ఆడాయి. అయితే, రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. మరోవైపు కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచి 2 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. దీంతో టీం మేనేజ్ మెంట్ డేవిడ్ వార్నర్‌ ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఈ మ్యాచ్‌లో కేన్ విలియమన్స్ సారథిగా వ్యవహరించనున్నాడు.

హెడ్ టు హెడ్

ఐపీఎల్ లో రాజస్థాన్, హైదరాబాద్ ఇప్పటి వరకు 13 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 7 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ గెలుపొందింది.

అత్యధిక స్కోర్

ఇక రాజస్థాన్‌పై హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 201 పరుగులు. కాగా.. హైదరాబాద్‌పై రాజస్థాన్‌ చేసిన అత్యధిక స్కోరు 198 పరుగులు.

పిచ్

టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ప్రారంభంలో కొద్దిగా ఇబ్బంది పడినా... తరువాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది.

టీంల బలాబలాలు

రాజస్థాన్ రాయల్స్

రాస్సీ వాన్ డెర్ డుసెన్ ఇండియాకు వచ్చాడు. కానీ, క్వారంటైన్‌లో ఉన్నాడు. జయదేవ్ ఉనద్కట్ వార్నర్ లేదా మనీష్ పాండేలను పెవిలియన్ చేర్చేందుకు మంచి ఆఫ్షన్‌. మనీష్ పాండే పై అతను 14 సగటుతో వికెట్లు తీశాడు. అయితే, రాజస్థాన్ రాయల్స్ శ్రేయాస్ గోపాల్ ను ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంది. కానీ, హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ స్పిన్ ఆడడంలో చాలా బలంగా కనిపిస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్

టి. నటరాజన్, భువనేశ్వర్ ద్వయం ఈ మ్యాచ్‌లో ఆడడం చాలా కష్టమే. అయితే, భువనేశ్వర్ తప్పకుండ తిరిగి వస్తాడని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. వార్నర్ ను కెప్టెన్సీ నుంచి మేనేజ్‌మెంట్ తప్పించింది. అలాగే విదేశీ బ్యాట్స్‌మెన్స్‌ లో మార్పులు చేయనున్నట్లు ఇప్పటికే యాజమాన్యం వెల్లడించాడు. దీంతో జాన్సన్ రాయ్ ఈ మ్యాచ్‌లో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది.

వ్యూహాలు

స్పిన్‌తో పోల్చినప్పుడు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్స్ లో ఎనిమిది మంది ఎక్కువ స్ట్రైయికింగ్ రేట్‌ను కలిగి ఉన్నారు. మిడిల్ ఓవర్లో స్పిన్ ఆడడంలో మాత్రం విఫలమవుతున్నారు. దీంతో హైదరాబాద్ టీం రషీద్, ముజీబ్ ను రంగంలోకి దించే అవకాశం ఉంది. ఈ స్పిన్ ద్వయం 7 ఎకానమీతో తలో 7 వికెట్లు తీశారు. ఇక ఆర్‌ఆర్ ఎనిమిది బ్యాట్స్‌మెన్స్ పై రషీద్ ప్రతీ ఓవర్లో 5 పరుగులు ఇచ్చాడు. బట్లర్ ను 14 బంతుల్లో 3 సార్లు ఔట్ చేశాడు.

మీకు తెలుసా?

- బట్లర్ ఎస్‌ఆర్‌హెచ్‌పై ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 9.12 సగటు, 94.81 స్ట్రైక్ రేట్ తో కేవలం 73 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధికంగా 16 పరుగులు.

- ఎస్‌ఆర్‌హెచ్‌ లో విదేశీ ఆటగాళ్లు చేసిన మొత్తం పరుగులలో దాదాపు 65 శాతం సాధించారు. మొత్తం వికెట్లలో 50 శాతం లోపు వారు తీసుకున్నారు.

- రాజస్థాన్ రాయల్స్ లో టాప్ ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌ లు స్పిన్‌తో పోలిస్తే పేస్‌కు వ్యతిరేకంగా ఎక్కువ స్ట్రైయింకింగ్ రేట్‌ను కలిగి ఉన్నారు.

ప్లేయింగ్ లెవన్ (అంచనా)

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యషస్వి జైస్వాల్, సంజు సామ్సన్ (కెప్టెన్, కీపర్), శివం దుబే, డేవిడ్ మిల్లెర్, రాహుల్ టెవాటియా, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్

సన్‌రైజర్స్ హైదరాబాద్: జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, జగదీషా సుచిత్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్

Show Full Article
Print Article
Next Story
More Stories