RCB vs RR: రాయల్స్ పై పోటీకి ఛాలెంజర్స్ రెడీ

IPL 2021 Rajasthan Royals vs Royal Challengers Bangalore Match in Dubai Cricket Stadium Today 29 09 2021
x

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - రాజస్తాన్ రాయల్స్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

* నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - రాజస్తాన్ రాయల్స్ మధ్య దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్ పోరు

RCB vs RR: ఐపీఎల్ 2021 లో ప్లే అఫ్ చేరడం కోసం పలు జట్ల మధ్య పోరు హోరాహోరిగా సాగుతుంది. నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న మ్యాచ్ లలో మంగళవారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది ముంబై. ఇక ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్స్ రాణించడంతో తక్కువ పరుగులకే కట్టడి చేయడంతో పాటు గత కొంతకాలంగా బ్యాటింగ్ లో నిలదొక్కుకోలేక సతమతమవుతున్న హార్దిక్ పాండ్య 40 పరుగులతో నాటౌట్ గా నిలిచి ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - రాజస్తాన్ రాయల్స్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 7 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ పై ఘన విజయంతో మంచి ఊపు మీదున్న కోహ్లిసేన రాజస్తాన్ పై కూడా రాయల్ గా గెలిచి ప్లేఆఫ్ లోకి వెళ్ళడానికి పట్టుదలతో ఉంది. మాక్స్ వెల్, కోహ్లి ఫామ్ లోకి రావడంతో హర్షల్ పటేల్ తన బౌలింగ్ తో జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మరోపక్క రాజస్తాన్ రాయల్స్ జట్టు ఇటీవలే సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలవడంతో 8 పాయింట్స్ తో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.

ఈ రోజు (బుధవారం) జరబోయే మ్యాచ్ లో ఏ టీం గెలిచినా ప్లేఆఫ్ పోరు మరింత రసవత్తరంగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. దుబాయ్ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు బెంగుళూరు - రాజస్తాన్ మధ్య జరిగిన 23 మ్యాచ్ లలో బెంగుళూరు 11, రాజస్తాన్ 10 మ్యాచ్ లలో గెలుపొందింది. బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన చివరి 3 మ్యాచ్ లలో 72,43,72 పరుగులు సాధించి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇరుజట్ల తుదిజట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు: విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడికల్, శ్రీకర్ భారత్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్, కైల్ జమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

రాజస్తాన్ రాయల్స్: లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్/తబరైజ్ షమ్సి, చేతన్ సకారియా, జయదేవ్ ఉనద్కట్/షేయాస్ గోపాల్, ముస్తాఫిజుర్ రహమాన్

Show Full Article
Print Article
Next Story
More Stories