సంజు సెంచరీ వృధా..‌ కింగ్స్ విజయం..ఆఖరిదాకా ఉత్కంఠగా సాగిన మ్యాచ్

IPL 2021
x

సంజు ఫైల్ ఫోటో 

Highlights

IPL 2021: సంజు శాంసన్‌ సెంచరీ వృథా అయ్యింది.

IPL 2021: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించింది. రాజస్థాన్‌పై నాలుగు పరుగుల తేడాతో పంజాబ్‌ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్.. రాజస్థాన్‌ముందు భారీ లక్ష్యాన్ని ముందుంచింది. ఆరు వికెట్లు కోల్పోయి 221 భారీ స్కోర్ చేసింది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్‌ ఓటమి పాలైంది. రాజస్థాన్ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడినా ఫలితం లేకపోయింది. చివరికి ఆ జట్టు7 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. ఐపీఎస్ 14 సీజన్‌లో సంజు శాంసన్ నమోదు చేసి రికార్డు సాధించారు.. 54 బంతుల్లోనే శాంసన్ సెంచరీ పూర్తి చేశాడు. నేడు మరో మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరగనుంది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (50 బంతుల్లో 91; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... దీపక్‌ హుడా (28 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) హైలైట్స్‌ చూపించాడు. చేతన్‌ సకారియా 3, క్రిస్‌ మోరిస్‌ 2 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసి ఓడిపోయింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో మయాంక్‌ (14) వెంటనే పెవిలియన్ చేరాడు. మూడో బ్యాట్స్ మెన్ గా వచ్చిన గేల్‌ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ నేపథ్యంలో 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికే అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచిన యూనివర్స్ బాస్ తాజాగా.. ఈ క్యాష్ రిష్ లీగ్‌లో 350 సిక్స్ మార్క్‌ను అందుకున్నాడు. గేల్‌ను రియాన్ పరాగ్ ఔట్ చేశాడు. దీంతో కింగ్స్ స్కోరు 89/2. ఆ తర్వాత చివరి 10 ఓవర్లలో పంజాబ్‌ ఏకంగా 132 పరుగులు చేసింది. స్కోరు 17.1వ ఓవర్లలోనే 200 పరుగుల్ని అవలీలగా దాటేసింది. ఇన్నింగ్స్‌ 13, 14 ఓవర్లయితే ప్రత్యర్థి బౌలర్లకు కాళరాత్రిని మిగిల్చాయి. దూబే 13వ ఓవర్లో రాహుల్‌ సిక్స్‌ కొట్టి 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంటే...దీపక్ హుడా ఆకాశమే హద్దుగా చెలరేగిపొయాడు. కేవలం 20 బంతుల్లోనే దీపక్‌ హుడా అర్ధసెంచరీని అధిగమించాడు. సెంచరీకి చేరువైన రాహుల్‌ చివరి ఓవర్లో ఔటయ్యాడు.

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రాజస్తాన్‌ రాయల్స్‌ బరిలోకి దిగింది. హిట్టర్‌ స్టోక్స్‌ (0) తొలి ఓవర్లో డకౌటైనా కంగారు పడిపోలేదు. కెప్టెన్‌ సామ్సన్‌కు వచ్చిన రెండు లైఫ్‌లు ఆ జట్టును లక్ష్యం వైపు దూసుకువెళ్లేళా చేశాయి. 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తయ్యాక ఎల్బీగా వెనుదిరగాల్సిన సంజూ రివ్యూతో బతికిపోయాడు. బట్లర్‌ (25; 5 ఫోర్లు), శివమ్‌ దూబే (23; 3 ఫోర్లు) వెంటనే పెవిలియన్ చేరారు. రియాన్‌ పరాగ్‌ (11 బంతుల్లో 25) సామ్సన్‌ ప్రత్యర్థి బౌలర్లను చావబాదాడు. 54 బంతుల్లోనే సాధించిన సెంచరీ సాధించాడు. ఆఖరి ఓవర్లో రాజస్తాన్‌ విజయానికి 13 పరుగులు అవసరమైన దశలో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. దీప్ ‌ సింగ్ చివరి ఓవర్ బౌలింగ్ వచ్చాడు. తొలి బంతికి ఎందుర్కొన్న సంజు పరుగు తీయలేదు. రెండో బంతికి సామ్సన్‌, మూడో బంతికి మోరిస్‌ సింగిల్స్‌ తీశారు. నాలుగో బంతిని సామ్సన్‌ సిక్సర్‌గా బాదాడు. దీంతో ఉత్కంఠ తారా స్తాయికి చేరింది. 2 బంతుల్లో 5 పరుగులు అవరసమయ్యాయి. ఈ నేపథ్యంలో క్రీజులో సామ్సన్ ఉండడంతో విజయం ఖాయం అనుకున్నారు. అయితే ఐదో బంతిని సామ్సన్‌ లాంగ్‌ఆఫ్‌ వద్దకు ఆడగా., మోరిస్‌ సింగిల్‌ కోసం వచ్చాడు. సామ్సన్‌ సింగిల్ నిరాకరించాడు. చివరి బంతికి రాజస్తాన్‌ గెలుపునకు 5 పరుగులు అవసరం. సామ్సన్‌ కవర్స్‌లో కొట్టిన భారీ షాట్‌ .. పంజాబ్‌ ఫీల్డర్‌ దీపక్‌ హుడా చేతికి చిక్కింది. దాంతో సంజు ఇన్నింగ్స్ కు తెరపడింది. కింగ్స్ విజయం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories