IPL 2021: హ్యాట్రిక్‌‌ విజయం‌తో దుమ్మురేపిన బెంగళూరు

Rcb Won The Match
x

RCB

Highlights

IPL 2021: ఐపీఎల్‌ సీజన్ 2021 భాగంగా చైన్నె వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది.

IPL 2021: ఐపీఎల్‌ సీజన్ 2021 భాగంగా చైన్నె వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. 205పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ 8 వికెట్లు నష్టపోయి 166 పరుగులకే పరిమితమైంది. కోల్ కతా బ్యాట్స్ మెన్స్ లో ఆల్ రౌండర్ రసెల్ 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ మోర్గాన్ (29), త్రిపాఠి (25) షకీబుల్ హాసన్(26), శుభమన్ గిల్ (21) నిరాశపరించారు. బెంగళూరు బౌలర్లలో జెమీసన్ 3 వికెట్లు పడగొట్టడు. చాహల్ రెండు, పటేల్ రెండు వికెట్లు తీసుకోగా... సుందర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో బెంగళూరు మూడు విజయాలు తమ ఖాతాలో వేసుకుంది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు. ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు కెప్టెన్ కోహ్లీ(5), పాటిదర్(1) వికెట్లను తొమ్మిది పరుగుల వ్యవధిలోనే చేజార్చుకుంది. మరో ఓపెనర్ దేవ్‌దత్‌తో జతకలిసిన మాక్స్‌వెల్(78పరుగులు, 49 బంతుల్లో, 9ఫోర్లు, 3సిక్సులు) చెలరేగిపోయాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్లను చీల్చిచెండాడు. వీరిద్దరి జోడి మూడో వికెట్‌కు 86 పరుగులు చేసింది. దేవ్ దత్త్(25) జట్టు స్కోర్ 95 పరుగలు దగ్గర ఔట్ అయ్యాడు.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్(76నాటౌట్ పరుగులు, 34బంతుల్లో, 9ఫోర్లు, 3సిక్సులు) మొదట్లో బ్యాలెన్స్ డ్ గా ఆడినప్పటికీ మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కమిన్స్ బౌలింగ్‌లో భారీ షాట్ కి యత్నించి భజ్జి చేతికి దొరికిపోయాడు. దీంతో నాలుగో వికెట్ 53పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మ్యాక్సీ ఔటైన అనంతరం డివిలియర్స్ రెచ్చిపోయాడు. డెత్ ఓవర్లలో కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో ఏబీ డివిలియర్స్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

రసెల్‌ వేసిన చివరి ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో మొదటి రెండు బంతులకు ఫోర్‌, సిక్స్‌ బాదిన డివిలియర్స్‌(76) నాలుగు, ఆరవ బంతిని బౌండరీలకు పంపడంతో బెంగళూరు 204 పరుగులు చేసింది. జేమీసన్‌ 11 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టగా..రసెల్, ప్రసిద్థ్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories