IPL 2021: టాస్ గెలిచిన బెంగళూరు.. ముగ్గురు ఆటగాళ్లతోనే బరిలోకి
IPL 2021:ఐపీఎల్ సీజన్ 2021 ఎడిషన్ 14లో భాగంగా బెంగళూరు, కోల్‌కతా జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో పదో మ్యాచ్ జరగబోతోంది.
IPL 2021: ఐపీఎల్ సీజన్ 2021 ఎడిషన్ 14లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో పదో మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ నెగ్గిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ జట్టు గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాలపై కన్నేసింది. మోర్గాన్ నాయకత్వంలో కోల్‌కతా నైట్‌రైడర్స్..బెంగళూరుపై విజయం సాధించి రెండో విజయం నమోదు చేయాలని భావిస్తోంది.
కోహ్లీ సేన ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతోంది. డాన్ క్రిస్టియన్ స్థానంలో రజత్ పాటిదార్ ఆడుతున్నాడు. కోల్‌కతా సారథి ఇయాన్ మోర్గాన్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. రెండు జట్లు ఇప్పటి వరకూ 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించగా.. 12 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలుపొందింది. మ్యాక్స్ వెల్, డివిలియర్స్(కీపర్), కైల్ జేమిసన్ తో కోహ్లీ సేన బరిలోకి దిగడం విశేషం. ఈ రెండు జట్లూ గతేడాది రెండు సార్లు తలపడ్డాయి. రెండు మ్యాచుల్లోనూ బెంగళూరే విజేతగా నిలిచింది.
కోల్‌కతా నైట్‌రైడర్స్:
మోర్గాన్(కెప్టెన్), శుభమన్ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్, ఆండ్రీ రసెల్, పాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ.
బెంగళూరు :
విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్, మ్యాక్స్ వెల్, డివిలియర్స్(కీపర్), షాబాజ్ అహ్మద్, సుందర్, కైల్ జేమిసన్, హర్షల్ పటేల్, సిరాజ్, చహల్.
#RCB have won the toss and they will bat first against #KKR in Match 10 of #VIVOIPL.
— IndianPremierLeague (@IPL) April 18, 2021
Follow the game here - https://t.co/OBmT3wfu6G pic.twitter.com/mYaZUcG5WQ
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire