IPL 2021: ఐపీఎల్ 14వ సీజన్ పై కరోనా ఎఫెక్ట్

Coronavirus Effect on IPL 2021
x

IPL 2021:(ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

IPL 2021: ఐపీఎల్ 14వ సీజన్ పై కరోనా ఎఫెక్ట్ పడింది.

IPL 2021: కరోనా వైరస్ అన్ని రంగాలపైన తన ప్రభావం చూపుతోంది. తాజాగా ఆ ప్రభావం క్రికెట్ పై కూడా పడింది. మన దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ముంబై వేదికగా వారం రోజుల్లో వాంఖడే స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ 14వ సీజన్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ స్టేడియంలో గ్రౌండ్స్ మెన్స్ గా పనిచేస్తున్న 8 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో స్టేడియంలో మ్యాచుల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.

ఏప్రిల్ 10వ తేదీన చెన్నై-ఢిల్లీ మధ్య వాంఖేడేలో మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఇప్పుడు దీనిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 25 తేదీల మధ్య వాంఖేడేలో 10 మ్యాచ్ లు జరగనున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో 19 మంది గ్రౌండ్ సిబ్బందికి పరీక్షలు చేయగా.. మార్చి 26న ముగ్గురికి పాజిటివ్ రాగా.. ఏప్రిల్ ఒకటిన మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. మరోవైపు మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుండడంతో ముంబైలో మ్యాచ్ లు నిర్వహించాలా? లేదా? అనే సందిగ్ధంలో బీసీసీఐ ఉంది. ముంబైలో జరగాల్సిన మ్యాచ్ లను ఇతర నగరాల్లో నిర్వహించేలా పునరాలోచన చేస్తోంది. ఈ ఘటనతో ఐపీఎల్ ప్రాంఛైజీలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తమ బేస్ క్యాంప్ ముంబైలో ఏర్పాటు చేసుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories