CSK vs MI: ధోని వర్సెస్ రోహిత్..బిగ్ ఫైట్..30మ్యాచ్‌ల్లో ఆధిపత్యం ఎవరిదంటే

IPL 2021 CSK vs MI Head to Head Total Match Records
x

IPL 2021 CSK vs MI (File Image)

Highlights

IPL 2021 CSK vs MI: సీజన్‌లో ఇప్పటి వరకూ 6 మ్యాచ్‌లాడిన చెన్నై 5 మ్యాచ్‌ల్లో విజయం

CSK vs MI Head to Head: ఐపీఎల్ 2021 సీజన్‌ 14వ ఎడిషన్‌లో భాగంగా శనివారం మరో హోరాహోరి పోరు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్, ధోని కెప్టన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 6 మ్యాచ్‌లాడిన చెన్నై 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఐదు మ్యాచులు ఆడిన ముంబై మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. చెన్నై తన చివరి మ్యాచ్‌ సన్ రైజర్స్ హైదరాబాద్‌ని ఓడించి ఉత్సాహంతో ఉంటే.. రాజస్థాన్‌పై ముంబై విజయం సాధించి ఫామ్‌లోకి వచ్చింది.

రెండు టీంల బలాబలాలు..

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తున్నాడు. అయితే అతని స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేదు. ఓపెనర్ డికాక్ ఫామ్ అందుకోవడం ముంబైకి కలిసోచ్చే అంశం. సూర్యకుమార్ యాదవ్ పర్వాలేదని పిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా మెరుపులు ఒకటి రెండు ఓవర్లకే పరిమితమవుతున్నాయి. కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యాలు ఫినిషర్ రోల్‌ని పోషిస్తున్నారు. ఇక ఇషాన్ కిషన్ ఈ మ్యాచుకు దూరం కానున్నాడు.

బౌలింగ్‌ విషయానికి వస్తే.. స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ కీలక సమయాల్లో రాణిస్తుండటంతో ముంబై పర్వాలేదనిపిస్తోంది. వీరు వికెట్లు పడగొట్టకపోయినా.. పరుగులు కట్టడిచేస్తున్నారు. డెత్ ఓవర్లలోనూ ఈ జోడీ మెరిస్తేనే ముంబైకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడో పేసర్ నాథన్ కౌల్టర్ నైల్ అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. స్పిన్నర్ రాహుల్ చహర్ వికెట్లు పడగొడుతుండడం కలిసొచ్చే అంశం. కృనాల్ పాండ్యా బౌలింగ్ లో విఫలం అవుతున్నాడు. ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. మరో స్పిన్నర్ జయంత్ యాదవ్ ఆకట్టుకునే పదర్శన చేయడంలేదు.

ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్‌ గైక్వాడ్‌ ప్రదర్శన ఆకట్టుకుంటుంది. అంతే దూకుడుగా ఆడుతూ.. చెన్నై భారీ స్కోరుకి బాటలు వేస్తున్నారు. సురేష్ రైనా, అంబటి రాయుడు ఫామ్ అందుకున్నారు. స్టార్ ఆల్‌రౌండర్‌ మొయిన్ అలీ ఉన్నంతసేపు పరుగుల వరద పారిస్తున్నాడు. ఎంఎస్ ధోనీ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు అభిమానులు. రవీంద్ర జడేజా, సామ్ కరన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెలరేగిపోతున్నారు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్, బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది.

మిడిల్ ఓవర్లలో మొయిన్ అలీ, రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నారు. చహర్ తన స్వింగ్, స్లో డెలివరీలతో రెచ్చిపోతున్నాడు. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో మరో విజయంపై చెన్నై మరో విజయంపై కన్నేశాడు. రెండు జట్లు ఇప్పటి వరకు ముఖాముఖిగా 30 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై 18 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. చెన్నై 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories