CSK vs SRH, 23rd Match Preview: చెన్నై జోరు ముందు హైదరాబాద్ నిలిచేనా?

Chennai Super Kings Vs Sunrisers Hyderabad Match Prediction | CSK vs SRH, 23rd Match Preview
x

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ ్యాచ్ (ఫొటో ట్విట్టర్)

Highlights

IPL 2021 CSK vs SRH Match Preview: ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు(బుధవారం) చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.

IPL 2021 CSK vs SRH Match Preview: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు(బుధవారం) చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్డేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన చెన్నై.. ఆ తరువాత వరుస విజయాలతో టోర్నీలో దూసుకెళ్తోంది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించి టోర్నీ నుంచి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టేలా ఉంది.

పిచ్

ఇది స్లో పిచ్. రెండు టీంలకు అనుకూలంగానే ఉండనుంది. పేసర్లకు, స్పిన్నర్లు రాణించేందుకు ఆస్కారం ఉంది.

హెడ్ టూ హెడ్

ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 14 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి ఇందులో 10 మ్యాచ్‌ల్లో చెన్నై టీమ్ గెలుపొందింది. 4 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ విజయం సాధించింది.

హైస్కోర్

హైదరాబాద్‌‌పై చెన్నై టీం చేసిన అత్యధిక స్కోరు 223 పరుగులు. అలాగే చెన్నైపై హైదరాబాద్ టీమ్ చేసిన హై స్కోరు 192 పరుగలు మాత్రమే.

టీంల బలాబలాలు

చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై టీమ్‌ బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ అద్భుతంగా రాణిస్తోంది. అలవోకగా భారీ స్కోర్లను చేధిస్తూ.. ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. ఓపెనర్లు డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ మంచి ఆరంభాన్ని అందిస్తూ.. టీం భారీ స్కోర్ చేసేందుకు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇక మిడిలార్డర్‌లో సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్రసింగ్ ధోనీ స్వేచ్ఛగా తమ బ్యాట్ ను ఝులిపించేందుకు బాటలు వేస్తున్నారు. చివర్లో రవీంద్ర జడేజా మెరుపు ఇన్నింగ్స్ చెప్పుకోదగినిది. వీరితోపాటు శామ్ కరన్, డ్వేన్ బ్రావో కూడా అప్పుడప్పుడు మెరుపులాంటి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు.

అలాగే బౌలింగ్ లో దీపక్ చాహర్ తన పదునైన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. అలాగే శామ్ కరన్ కూడా చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. ఇక మిడిల్ ఓవర్లలో రవీంద్ర జడేజా, ఇమ్రాన్ తాహిర్ ఎలాగూ ఉన్నారు. వీరిద్దరు పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. వికెట్లు పడగొడుతున్నారు. శార్ధూల్ ఠాకూర్ విలువైన జోడీల వికెట్లు తీస్తూ.. ప్రత్యర్థులను దెబ్బ తీస్తున్నాడు. చివర్లో డ్వేన్ బ్రావో కూడా పర్వాలేదనిపిస్తున్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ అన్ని రంగాల్లో బలహీనంగా తయారైంది. చిన్న స్కోర్లను చేధించలేక బ్యాట్స్‌మెన్స్ ఇబ్బంది పడుతుండగా.. భారీ స్కోర్లను కాపాడుకోలేక బౌలర్లు తేలిపోతున్నారు. మొత్తంగా ఈ సీజన్‌ లో హైదరాబాడ్ టీంను బ్యాడ్ లక్ వెంటాడుతోంది.

ఓపెనర్లు శుభారంభం అందించినా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ విఫలమవడంతో టీం ఓడిపోతోంది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్ లు నిలబడితేనే మ్యాచ్‌లు గెలిచేలా తయారైంది. ఇక మిడిలార్డర్‌ కేన్ విలియమ్సన్ రాకతో కాస్త కుదురుకున్నట్లు కనిపించింది. కానీ.. అతనికి జోడీగా ఎవ్వరూ నిలబడలేకపోతున్నారు. విరాట్ సింగ్, కేదార్ జాదవ్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, విజయ్ శంకర్ ఇంతవరకు చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక జగదీశ్ సుచిత్ పర్వాలేదనిపిస్తున్నాడు.

బౌలింగ్ పరంగా హైదరాబాద్ టీమ్‌లో రషీద్ ఖాన్ ఒక్కడే రాణిస్తున్నాడు. ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ కౌల్, స్పిన్నర్ సుచిత్ వికెట్లు తీయాలని టీం ఆశిస్తోంది. పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా... వికెట్లు తీయడంలో తడబడుతున్నారు.

ప్లేయింగ్ లెవన్ (అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ / డ్వేన్ బ్రావో, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప / అంబతి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, సామ్ కుర్రాన్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్

సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, విరాట్ సింగ్ / మనీష్ పాండే, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, కేదార్ జాదవ్ / అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, జగదీషా సుసిత్, ఖలీల్ అహ్మద్ / భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్

Show Full Article
Print Article
Next Story
More Stories