IPL 2020: చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రువాత సారధి అత‌డేనా?

IPL 2020: చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రువాత సారధి అత‌డేనా?
x

CSK’s next captain is already at the back of Dhoni’s mind,’

Highlights

IPL 2020: ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ ప‌దేండ్లుగా నాయకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది కూడా ఆయన‌నే కెప్టెన్ గా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఈ పది సంవత్సరాలలో చెన్నైకి ఎన్నో మరపురాని విజయాలు అందించాడు.

IPL 2020: ఎంఎస్ ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్ ప‌దేండ్లుగా నాయకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది కూడా ఆయన‌నే కెప్టెన్ గా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఈ పది సంవత్సరాలలో చెన్నైకి ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలుపొందారు. అంతేకాకుండా వ‌న్ ఆఫ్ ది మోస్ట్ స‌క్సెస్ పుల్ టీమ్‌గా మ‌లిచారు. ఎంఎస్ ధోని ధోని నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ ఆడతాడో లేదో తెలియదు. ఒక వేళ ఆడినా.. ఆ నెక్ట్స్ ఇయ‌ర్ కైనా వెళ్లిపోవాల్సిందే.. మ‌రి అప్పుడు టీమ్‌ను నడిపించేదెవరు? చెన్నై సూపర్ కింగ్స్ టీం త‌రువాత కెప్టెన్ ఎవరన్నదని అందరికీ పెద్ద ప్ర‌శ్నలా మారింది. ఎందుకంటే.. చెన్నై సూపర్ కింగ్స్ లో ధోనీ వ‌న్ మ్యాన్ ఆర్మీ.. అత‌ని వ‌ల్లే సీఎస్‌కేకు అంత‌టి క్రేజ్ ఉన్న‌ది. ఆయ‌న త‌రువాత కూడా అంతే క్రేజ్‌ను పొందాలంటే.. త‌రువాత సార‌థి కూడా అంతే సామ‌ర్థ్యంకలిగి ఉండాలి.

టీమిండియాకు అత్యంత క్రేజీ ఉన్న.. విరాట్ కోహ్లీకి గొప్ప కెప్టెన్ అందించాడు ధోనీ. అత‌న్ని మంచి కెప్టెన్ గా త‌యారు చేశాడు. ఎన్నో మంచి విజ‌యాల‌ను అందుకుంటూ టీమిండియాను దూసుకుంటూ వెళ్లేలా చేస్తున్నాడు విరాట్ కోహ్లీ.. సీఎస్‌కే కూడా అలాంటి కెప్టెన్‌ను ఇస్తాడ‌ని అంటున్నాడు బ్రావో.. ఇటీవ‌ల బ్రావో ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ.. చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ఈ రోజు కాక‌పోతే .. రేపైన విడి వెళ్లి పోవాల్సిందే.. కానీ సీఎస్‌కే కు ఓ మంచి కెప్టెన్ కావాలి.ఆ కెప్టెన్ ఎవ్వరో.. ఇప్ప‌టికే ఎం ఎస్ ధోనీ మైండ్ లో ఉన్నాడు. మేం వెళ్లిపోయే ముందు.. కెప్టెన్ బాధ్య‌త‌ల‌ను ఇత‌రుల అప్ప‌గించాల్సిందే. అది రైనా నా? మ‌రి ఇంకెవ‌రైన‌నా అన్న‌ది ధోనీ మైండ్‌లో ఉంద‌నీ అన్నారు. రైనా కూడా చెన్నైతో ఆడుతున్నాడు. చాలా సంవ‌త్స‌రాలుగా రైనా కూడా వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తు్న్నారు. ఇప్ప‌టికే త‌రువాత‌ సీఎస్‌కే .. కెప్టెస్ సురేశ్ రైనా నే అభిమానులు అంటున్నారు. దీనికి తోడు బ్రావో నోట సురేశ్ రైనా పేరు రావడంతో నెస్ట్స్ కెప్టెన్ రైనానే అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories