IPL 2020: రూల్స్ బ్రేక్ చేసిన కోహ్లీ .. త‌ప్పు తెలుసుకుని వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు

IPL 2020: రూల్స్ బ్రేక్ చేసిన కోహ్లీ .. త‌ప్పు తెలుసుకుని వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు
x

IPL 2020: రూల్స్ బ్రేక్ చేసిన కోహ్లీ .. త‌ప్పు తెలుసుకుని వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు

Highlights

IPL 2020: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ రూల్‌ని బ్రేక్ చేశాడు. కోహ్లీ ఏంటీ ? రూల్స్ బ్రేక్ చేయడమేంటి అనుకుంటున్నారా..

IPL 2020: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ రూల్‌ని బ్రేక్ చేశాడు. కోహ్లీ ఏంటీ ? రూల్స్ బ్రేక్ చేయడమేంటి అనుకుంటున్నారా.. అవునండీ.. దుబాయ్ వేదికగా సోమ‌వారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జ‌రిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ .. అలవాటులో ఓ పొరపాటు చేశాడు. కరోనా ప్రొటోకాల్స్‌ను మరిచి బంతికి ఉమ్మిని పూసి ఐసీసీ నిబంధనను అతిక్రమించాడు.

ఢిల్లీ ఇన్నింగ్స్‌లోని మూడో ఓవర్‌లో పృథ్వీ షా ఆడిన మెరుపు షాట్‌ను షార్ట్‌ కవర్‌లో ఫీల్డింగ్‌ చేసిన కోహ్లీ అడ్డుకున్నాడు. ఈక్రమంలో బంతికి అనుకోకుండా ఉమ్మిని పూసి వెంటనే చేయి వెనక్కి తీసుకున్నాడు. అయితే తప్పు తెలుసుకున్న విరాట్‌ పొరపాటు అయిందన్నట్టుగా నవ్వుతూ చేతిని పైకెత్తి సంజ్ఞ చేశాడు. ఈ సంఘటనపై సచిన్‌ టెండూల్కర్‌ కూడా ట్విటర్‌ వేదికగా స్పందించాడు. 'గెలిచే కసిలో అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతుంటాయి' మరేం పర్లేదన్నట్లు సచిన్‌ ట్వీట్‌ చేశాడు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. బంతిపై ఉమ్ము రుద్దడాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల నిషేధించింది. అయినప్పటికీ.. కొంత మంది క్రికెటర్లు అలవాటులో పొరపాటులా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బంతిపై ఉమ్ముని రాస్తున్నారు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ఫీల్డర్ రాబిన్ ఉతప్ప.. క్యాచ్‌ని వదిలేసిన తత్తరపాటులో బంతిపై ఉమ్ము రాస్తూ కనిపించాడు. అయితే.. ఫీల్డ్ అంపైర్లు అతని తప్పిదాన్ని గుర్తించలేదు. కానీ.. నెటిజన్లు మాత్రం ఏంట‌ప్ప.. ఉతప్ప అంటూ విమ‌ర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories