IPL 2020 Updates : చెన్నై కి షాకిచ్చిన రాజస్థాన్!

IPL 2020 Updates : చెన్నై కి షాకిచ్చిన రాజస్థాన్!
x
Highlights

IPL 2020 Updates : తన ఆల్రౌండ్ నైపుణ్యంతో రాజస్థాన్ రాయల్స్ పటిష్టమైన చెన్నై జట్టుకు షాకిచ్చి ఐపీఎల్ 2020 లో శుభారంభం చేసింది!

రాజస్థాన్ చెన్నైకి షాక్ ఇచ్చింది. మొదట చెన్నై బౌలర్లను ఉతికి ఆరేసిన రాజస్థాన్ ఆటగాళ్ళు తరువాత బౌలింగ్..ఫీల్డింగ్ లలో చెన్నై బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసి మంచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కొంత ప్రయత్నం చేసినా అంత భారీస్కోరు చేదించడానికి అది సరిపోలేదు. ఒకరకంగా ఆ స్కోరును చూసి చేతులేట్టేసినట్టే కనిపించింది. పెద్దగా పోరాటం చేసినట్టు కనిపించలేదు. 217 పరుగుల విజయలక్ష్యాన్ని చేదించడానికి ఆడినట్టు కాకుండా 200 పరుగుల విజయలక్ష్యం కోసం ఆదినట్టుగా చెన్నై బ్యాటింగ్ సాగింది. డుప్లిసిస్ (69) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతనికి చివర్లో ధోనీ రూపంలో కొద్ది సహకారం దొరికినా అప్పటికే ఆలస్యం అయిపోయింది. 19 వ ఓవర్లో డుప్లిసిస్ అవుట్ అవడంతో పూర్తిగా చెన్నై గెలుస్తుంది అనే ఆశ అందరికీ పోయింది. అయితే, ధోనీ చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్స్ లు బాదడం ఒక్కటే అభిమానులకు ఊరట కలిగించే అంశంగా మారింది.

217 పరుగుల చెన్నై చేజింగ్ సాగిందిలా..

* 3 ఓవర్లకు చెన్నై స్కోర్‌ 19/0 అంటే ప్రారంభం ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. చాలా మెల్లగా చెన్నై ప్రారంభించింది. ఇదే చివరకు కొంప ముంచింది.

* ఇక 5 ఓవర్లకు చెన్నై 36 పరుగులు చేసింది. శ్రేయస్‌ గోపాల్‌ వేసిన ఈ ఓవర్‌లో చివరి బంతికి వాట్సన్‌ మరో సిక్సర్‌ బాదాడు. ఇక స్కోరు బోర్డు పరిగేడుతుందని అందరూ ఆశించారు.

* అనుకున్నట్టే టామ్‌ కరన్‌ వేసిన ఆరో ఓవర్‌లో షేన్‌వాట్సన్‌ రెండు సిక్సులు, ఒక ఫోర్‌ కొట్టి ఆశలు రేపాడు. ఈ ఓవర్‌లో మొత్తం 17 పరుగులు వచ్చాయి.

* ఏడో ఓవర్ లో చెన్నై కి తోలి దెబ్బ తగిలింది. వేగంగా ఆడుతున్న షేన్ వాట్సన్ రాహుల్‌ తివాతియా బౌలింగ్ లో ఔట్‌ అయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి బంతి మిస్‌ అయి బౌల్డయ్యాడు. దీంతో 56 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది చెన్నై ఈ దశలో డుప్లెసిస్‌ క్రీజులోకి వచ్చాడు. 7 ఓవర్లకు చెన్నై 57/1తో నిలిచింది.

* రాజస్థాన్‌ ఎనిమిదో ఓవర్‌లో మరోసారి విరుచుకు పడింది. శ్రేయస్‌ గోపాల్‌ వేసిన బంతికి మురళీ విజయ్‌(21) ఔటయ్యాడు. 8 ఓవర్లకు చెన్నై స్కోర్‌ 64/2గా నమోదైంది.

* సామ్‌కరన్‌ 9వ ఓవర్‌ లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో ముంబాయి మ్యాచ్ సీన్ రిపీట్ అవుతున్నట్టు కనిపించింది అయితే ఆ ఆశ అదే ఓవర్ లో ఐదో బంతికి తీరిపోయింది. రాహుల్‌ తివాతియా ఈ ఓవర్ వేశాడు. ఆ వెంటనే ఆరో బంతికి రుతురాజ్‌ గైక్వాడ్‌(0)ను అతడు ఔట్‌ చేశాడు. దీంతో చెన్నై 9 ఓవర్లకు 77 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.

* 10 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది.

* ఇక అక్కడ నుంచి కేదార్ జాదవ్.. డుప్లిసిస్ ఆచి తూచి ఆడారు. శ్రేయాస్‌ గోపాల్‌ వేసిన 12వ ఓవర్‌లో తొలి మూడు బంతులను కేదార్‌ జాధవ్‌ ఫోర్లుగా మార్చడంతో చెన్నై 100 పరుగులు దాటింది.

* 14వ ఓవర్‌ నాలుగో బంతికి భారీ షాట్‌ ఆడబోయిన కేదార్‌ జాధవ్‌(22) ఔటయ్యాడు. బంతి కీపర్‌ తలమీదుగా పోతుండగా శాంసన్‌ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అందుకున్నాడు. దీంతో చెన్నై ఐదో వికెట్‌ కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి ధోనీ వచ్చాడు. ఈ ఓవర్ ముగిసే సరికి డుప్లిసిస్ 17 పరుగులతో ఉన్నాడు.

* ధోనీ డుప్లిసిస్ కు అవకాశం ఇస్తూ మెల్లగా ఆడాడు. దీంతో డుప్లిసిస్ బ్యాట్ ఝులపించాడు. ఉనద్కత్‌ వేసిన 17వ ఓవర్‌లో డుప్లెసిస్‌ మూడు సిక్సులు బాదడంతో పాటు మూడు సింగిల్స్‌ వచ్చాయి. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 21 పరుగులు వచ్చాయి. చెన్నై 17 ఓవర్లకు 159/5తో నిలిచింది.

* 12 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన స్థితికి చెన్నై చేరింది. ఈదశలో రెండు సిక్స్ లు కొట్టి కొద్దిగా ఆశలు కలిగించాడు డుప్లిసిస్ అయితే, అదే ఊపులో 19 ఓవర్లో అవుట్ అయిపోయాడు. దీంతో చెన్నై ఓటమి ఖాయం అయిపొయింది. అభిమానులు కనీసం 200 పరుగులు చేస్తే చాలనుకునే స్థితికి వచ్చేశారు. ఆ ఆశను ధోనీ తీర్చాడు. చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్స్ లు బాది చెన్నై ను 200 పరుగుల వద్దకు తీసుకు వెళ్ళాడు. దీంతో 16 పరుగుల తేడాతో చెన్నై రాజస్థాన్ రాయల్స్ పై ఓటమి పాలైంది.

చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ కార్డు:

మురళీ విజయ్ 21 (21) షేన్ వాట్సన్ 33 (21) ఫాఫ్ డు ప్లెసిస్ 72 (37) సామ్ కుర్రాన్ 17 (6) ​​ రుతురాజ్ గైక్వాడ్ 0 (1) కేదార్ జాదవ్ 22 (16) ఎంఎస్ ధోని* 29 (29) రవీంద్ర జడేజా* 1 (2) EXTRAS 5 మొత్తం (6 వికెట్లు; 20 ఓవర్లు) 200

రాజస్థాన్ రాయల్స్ స్కోర్ కార్డు:

యశస్వి జైస్వాల్ 6 ( 6 ) స్టీవ్ స్మిత్ 69 (47 ) సంజు సామ్సన్ 74 (32 ) డేవిడ్ మిల్లెర్ రనౌట్ 0 (0 ) రాబిన్ ఉతప్ప 5 (9 ) రాహుల్ టెవాటియా 10 (8 ) రియాన్ పరాగ్ 6 (4 ) టామ్ కుర్రాన్* 10 (9 ) జోఫ్రా ఆర్చర్* 27( 8 )

EXTRAS (nb 3, w 5, b 1, lb 0, pen 0) 9 మొత్తం (7 వికెట్లు; 20 ఓవర్లు) 216

#Awards #

గేమ్ చెంజ‌ర్ అవార్డు @సంజు శాంస‌న్‌ #మ్యాన్ ఆఫ్ ది స్ట్రైక్ రేట్ @సంజు శాంస‌న్‌ # మోస్ట్ సిక్సెస్ అవార్డు @సంజు శాంస‌న్‌ # ప‌వ‌ర్ ఫ్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ @వాట్స‌న్ #మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ @ సంజు శాంస‌న్




Show Full Article
Print Article
Next Story
More Stories