IPL 2020 Updates : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్ 13 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్ కి
IPL 2020 Updates : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్ 13 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్ కి ఆతిథ్యం ఇచ్చే దుబాయ్ లోని అబుదాబీ ముస్తాబయింది.. మొదటి మ్యాచ్ షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.. ఈ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా రెడీ చేశారు.. రాత్రివేళ సమయంలో ఈ స్టేడియం కాంతి వెలుగులతో జిగేల్ మంటోంది.. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ కార్యదర్శి జే షా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
3 more days to go!
— Jay Shah (@JayShah) September 16, 2020
What a spectacular and breathtaking view from the stadiums in Dubai and Abu Dhabi.
United Arab Emirates looks all set to host the most awaited tournament of the year #IPL2020. The world is ready, so are we! @IPL @BCCI @SGanguly99 @ThakurArunS pic.twitter.com/L3mE65arFH
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. అటు మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 19 ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 07: 30 సమయంలో మొదలవుతుంది.. ఇక ఇప్పటికే ఈ సీజన్ కు సంబంధించిన ఏర్పాట్లను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వయంగా పరిశీలించారు.. మొత్తం 60 మ్యాచ్‌లు 53 రోజులతో ఐపీఎల్ అభిమానులను అలరించనుంది. మొత్తం మూడు వేదికలలోనే ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక మొదటి మ్యాచ్ లో పిచ్ ఎక్కువగా స్పినర్లుగా అనుకులించనుంది.
వాస్తవానికి ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 29 న ప్రారంభం కావాల్సి ఉంది. అప్పుడే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుతుండడంతో టోర్నీని ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసింది. అయినప్పటికీ కరోనావైరస్ మహమ్మారి మరింతగా పెరగడంతో ఇండియాలో ఐపీఎల్ నిర్వహణ కష్టం అయిన భావించి చివరికి దుబాయ్ కి షిఫ్ట్ చేసింది. ప్రస్తుతం అన్ని జట్లు అక్కడికి చేరుకొని తమ ప్రాక్టిస్ లను మొదలు పెట్టాయి..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire