IPL 2020: డ‌బుల్ క్యాప్ క‌హానీ

IPL 2020: డ‌బుల్ క్యాప్ క‌హానీ
x

IPL 2020: డ‌బుల్ క్యాప్ క‌హానీ 

Highlights

IPL 2020: క‌రోనా కార‌ణంగా క్రికెట్ లో కొన్ని నిబంధనల్లో మార్పులు వ‌చ్చాయి. ఆ నిబంధనలు క‌ఠినంగా ఉన్నా అంద‌రూ క‌చ్చితంగా పాటించాల్సిందే. బంతిపై ఉమ్ము రుద్ద‌‌డం. వికెట్ తీసినా.. ఒక్కరినొక్క‌రూ కౌగిలించుకోని సంబురాలు చేసుకోవ‌డం

IPL 2020: క‌రోనా కార‌ణంగా క్రికెట్ లో కొన్ని నిబంధనల్లో మార్పులు వ‌చ్చాయి. ఆ నిబంధనలు క‌ఠినంగా ఉన్నా అంద‌రూ క‌చ్చితంగా పాటించాల్సిందే. బంతిపై ఉమ్ము రుద్ద‌‌డం. వికెట్ తీసినా.. ఒక్కరినొక్క‌రూ కౌగిలించుకోని సంబురాలు చేసుకోవ‌డం, షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటివి నిషేధం. క‌రోనా నిబంధ‌న‌ల‌ను ఆచ‌రిస్తూ.. ఆటను సాగిస్తున్నారు. ఈ క‌రోనా నిబంధ‌న‌లు అమ‌లులో ఉన్న వేళ మైదానం ఆసక్తిక‌ర ఆంశాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా.. కొంద‌రూ ఫిల్డ‌ర్‌లు ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ క్యాపులు పెట్టుకుని మైదానం ద‌ర్శ‌న‌మిస్తున్నారు. దీని వెనుక అస‌లు కార‌ణం క‌రోనా నిబంధ‌న‌లే.

అన్ ఫిల్డ్ ప్రోటోకాల్ ప్ర‌కారం .. ఆట‌గాళ్ల అన‌వ‌స‌రంగా ఇత‌ర ఆటగాళ్లను గానీ, ఎంఫైర్ ను గానీ తాక‌రాదు. అలాగే .. క్యాపులు, స‌న్ గ్లాసెస్‌, టావ‌ల్స్ ను ఇత‌ర ఆట‌గాళ్ల‌కు ఇవ్వ‌రాదు. గతంలో బౌల‌ర్లు బౌలింగ్ చేసే ముందు త‌మ వ‌స్తువుల‌ను ఎంఫైర్ల‌కు ఇస్తుంటారు. కానీ ఇప్పుడూ ఆ ప‌రిస్థితి లేదు. కోవిడ్ నియ‌మావ‌ళి ప్ర‌కారం.. బౌల‌ర్లు త‌మ వ‌స్తువుల‌ను ఎంఫైర్‌కు ఇవ్వ‌రాదు. క‌రోనా మార్గ‌ద‌ర్శకాల‌ను ఖ‌చ్చితంగా పాటించాలి.

కానీ.. క్యాప్ విష‌యంలో మాత్రం కాస్త స‌డ‌లింపునిచ్చారు. బౌలింగ్ చేసే ముందు బౌల‌ర్లు త‌మ క్యాప్ ను ఇత‌ర ఇవ్వ‌వ‌చ్చు. అది కూడా డైరెక్ట్ గా చేతికి ఇవ్వ‌కుండా.. ఇత‌ర ఆట‌గాళ్ల త‌ల‌పై పెట్టాలి. ఈ సంద‌ర్బంలోనే.. ప‌లువురు ఆట‌గాళ్ల త‌ల‌పై రెండు, మూడు క్యాపులు కనిపిస్తున్నాయి. గ‌త నెల‌లో జరిగినా ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో ఆట‌గాళ్లు రెండు టోపిల‌తో క‌నిపించారు. క‌రోనా నియ‌మావ‌ళి అమల్లో ఉన్నన్ని రోజులు ఇలాంటి ఆసక్తిక‌ర విష‌యాలు ఎన్ని క‌నిపిస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories