IPL 2020: ధోనీపై భాద్యత మరింత పెరిగింది: గంభీర్

IPL 2020: ధోనీపై భాద్యత మరింత పెరిగింది: గంభీర్
x
Highlights

IPL 2020 | సురేష్ రైనా, హర్బజన్ సింగ్ దూరం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై బాధ్యత మరింత పెరిగిందని టీంఇండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు.

IPL 2020 | సురేష్ రైనా, హర్బజన్ సింగ్ దూరం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై బాధ్యత మరింత పెరిగిందని టీంఇండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. 'ధోనీ ఏడాది నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఒక్క దరి గ్రౌండ్ లోకి దిగి రాణించాలంటే ఎవరికైనా సవాలే.బ్యాట్స్ మ్యాన్ గా ఎక్కువ పరుగులు చేసినప్పుడే సారధిగా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. జట్టులో రైనా, బజ్జీ లేకపోవటం లోటనే చెప్పాలి. సురేష్ రైనా జట్టులో లేదు కాబట్టి ధోనీ మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు రావాలి'. అని గౌతం గంభీర్ అన్నాడు.

ప్రపంచ‌వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ 2020 ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న‌ది. తొలి మ్యాచ్ రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెడింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరగనుంది. ఇప్పటికే అన్ని జట్లన్నీ ప్రాక్టీస్‌లో పూర్తిగా నిమగ్నమయ్యాయి. ఈసారి ఐపీఎల్‌లో మ్యాచ్‌లన్నీ షార్జా, దుబాయ్‌, అబుదాబి వేదికగా జరగనున్నాయి. ఈ క్ర‌మంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఐపీఎల్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాడు.

భారత ఉపఖండంలో ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో క్రికెట్ ప్రసారాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఐసీసీ అనుబంధ సభ్యులుగా ఉన్న ప్రతీ దేశంలో ఐపీఎల్ ప్రసారం చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి తగినట్లుగా ప్రొడక్షన్ టీం సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 9 భాషల్లో ఐపీఎల్ ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. ఇంగ్లీష్, హిందీతో పాటు ఏడు భారత ప్రాంతీయ భాషల్లో వేర్వేరుగా ప్రసారం చేయనున్నారు. స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన ప్రాంతీయ భాషా ఛానెల్స్‌లో ప్రతీ రోజు ప్రసారాలు ఉంటాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories