IPL 2020: అందుకే రైనా ఐపీఎల్‌కు దూరం!

IPL 2020: అందుకే రైనా ఐపీఎల్‌కు దూరం!
x

సురేష్ రైనా 

Highlights

IPL 2020: క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పోటీ క్రికెట్ పార్మ‌ట్ అదే ఐపీఎల్‌‌‌. అభిమానుల‌కు అద్యంతం వినోదమే. క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఈ ఏడాది కొద్దిగా ఆల‌స్యమైంది.

IPL 2020: క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పోటీ క్రికెట్ పార్మ‌ట్ అదే ఐపీఎల్‌‌‌. అభిమానుల‌కు అద్యంతం వినోదమే. క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఈ ఏడాది కొద్దిగా ఆల‌స్యమైంది. కానీ.. ఈ ఫార్మట్‌కు ఆది నుంచే ఆటంకాలు ఎదురువుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ కు అడుగ‌డుగున ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. తొలుత క‌రోనా .. త‌రువాత టైటిల్ స్పాన్స‌ర్ స‌మ‌స్య‌.. ఆ త‌రువాత ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి కరోనా సోకడం.. వీట‌న్నీంటితో చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం స‌తమ‌త‌వుతుంటే.. తాజాగా చెన్నై సూపర్ సింగ్స్(సీఎస్‌కే) స్టార్ ఆటగాడు సురేశ్ రైనా హఠాత్తుగా ఐపీఎల్‌ నుంచి వైదొలిగాడు. దుబాయ్ నుంచి భారత్‌కు పయనమయ్యాడు. దీంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల సురేశ్ రైనా వైదొలిగిన‌ట్టు చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం తెలిపింది.

కానీ అస‌లు కార‌ణం .. అత‌ని దగ్గరి బంధువు దారుణ హత్యకు గురవడంతోనే రైనా ఐపీఎల్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. రైనా మామ‌ దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. దోపిడీ దొంగల దాడిలో ఆయ‌న ప్రాణాలు కోల్పోగా నలుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడినట్లు పంజాబ్‌లోని పఠాన్‌కోటా పోలీసులు శనివారం సాయంత్రం తెలిపారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ గుల్నీత్ సింగ్ తెలిపారు.

చెన్నై జట్టులో కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుండడం రైనాను భయాందోళనకు గురిచేసినట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లోనే కేసుల సంఖ్య 13కు చేరడంతో అతను తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడట. 'శుక్రవారం రాత్రి ఈ విషయమై కోచ్‌ ఫ్లెమింగ్‌, కెప్టెన్‌ ధోనీతోపాటు సహచర ఆటగాళ్లకు రైనా పదే పదే కాల్‌ చేస్తూ తన భయాన్ని వ్యక్తం చేశాడు. అతడిని సముదాయించేందుకు ధోనీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. మానసికంగా అతను ఇబ్బందిపడుతున్నాడు. ఈ పరిస్థితిలో అతడిని ఇక్కడే ఉంచడం అనవసరం అనిపించింది' అని జట్టు ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories