IPL 2020: శిఖ‌ర్ ధావ‌న్ అరుదైన రికార్డు @5000

IPL 2020: శిఖ‌ర్ ధావ‌న్ అరుదైన రికార్డు @5000
x
Highlights

IPL 2020: ఐపీఎల్‌-13లో భాగంగా దుబాయ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

IPL 2020: ఐపీఎల్‌-13లో భాగంగా దుబాయ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ దూకుడైన ఆట తీరుతో స్కోర్ బోర్డును ప‌రిగెత్తిస్తున్నాడు. ఐపీఎల్‌-13వ సీజన్‌లో వరుసగా నాలుగోసారి 50 ఫ్ల‌స్ సాధించాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ధావన్‌ 28 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ధావన్‌కిది 40వది కావడం విశేషం. మరో ఎండ్‌లో బ్యాట్స్‌మన్‌ సహకరించకున్నా తన దూకుడును కొనసాగిస్తున్నాడు.

ఈ క్ర‌మంలోనే శిఖ‌ర్ ధావ‌న్ మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించాడు. త‌న ఐపీఎల్ కెరీర్ లో 5000 ప‌రుగులు పూర్తి చేశాడు. దీంతో 5000 మార్క్‌ సాధించిన నాల్గో భారతీయ క్రికెట‌ర్‌గా రికార్డు నెల‌కొల్పాడు.

గత సీజన్లో సురేశ్ రైనా 5000 పరుగుల క్లబ్‌లో చేరిన తొలి ఆటగాడిగా నిలవగా.. తర్వాత విరాట్ కోహ్లి సైతం ఈ క్లబ్‌లో చేరాడు. 178 ఇన్నింగ్స్‌ల్లో 5759 రన్స్‌ చేసిన కోహ్లి.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు దూరమైన రైనా.. 189 ఇన్నింగ్స్‌ల్లో 5149 రన్స్ చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్లోనే 5 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఐపీఎల్‌లో 191 ఇన్నింగ్స్ ఆడిన హిట్ మ్యాన్ 5149 రన్స్ చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories