IPL 2020: సన్‌రైజర్స్‌ బౌల‌ర్‌కు తెవాటియా వార్నింగ్

IPL 2020: సన్‌రైజర్స్‌ బౌల‌ర్‌కు తెవాటియా వార్నింగ్
x

IPL 2020: సన్‌రైజర్స్‌ బౌల‌ర్‌కు తెవాటియా వార్నింగ్

Highlights

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ ఉత్కంఠంగా సాగింది. రాహుల్‌ తెవాటియా మ‌రో సారి ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై చేల‌రేగాడు

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ ఉత్కంఠంగా సాగింది. రాహుల్‌ తెవాటియా మ‌రో సారి ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై చేల‌రేగాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో రాహుల్‌ తెవాటియా 28 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సుల‌తో 45 ప‌రుగులు, రియాన్‌ పరాగ్ ‌26 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సుల‌తో 42 ప‌రుగులు. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో సన్‌రైజర్స్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 5 వికెట్లు కోల్పోయి మరో బంతి ఉండగానే ఛేదించింది.

మ్యాచ్‌ అనంతరం డేవిడ్‌ వార్నర్‌ షేక్‌ హాండ్‌ ఇచ్చేందుకు వచ్చినప్పుడు రాహుల్‌ వాగ్వాదానికి దిగాడు. వార్నర్‌తో కోపంగా ఏదో మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ చివరి ఓవర్‌లో సన్ రైజర్స్ పేసర్ ఖలీల్ అహ్మద్, రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ రాహుల్ తెవాటియా మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ విజయానికి 6 బంతుల్లో 8 పరుగులు అవసరం. చివరి ఓవర్‌ను ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చేశాడు. రియాన్ పరాగ్ మొదటి బంతికి రెండు పరుగులు, రెండో బంతికి ఒక పరుగు చేశాడు. మూడో బంతికి తెవాటియా రెండు పరుగులు చేశాడు. ఇక నాలుగో బంతికి సింగిల్ తీసిన తెవాటియా.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌కు వెళ్లాడు. ఆ స‌మ‌యంలో తొలుత‌ రాహుల్‌, ఖలీల్‌ మధ్య ఏదో సంభాషణ జరిగింది. ఐదో బంతికి రియాన్‌ పరాగ్‌ సిక్స్‌ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

అప్పుడే వారి మధ్య వాగ్వాదం పెరిగింది. మ్యాచ్‌ అనంతరం డేవిడ్‌ వార్నర్‌ వచ్చి రాహుల్‌కు సర్దిచెప్పాడు. వార్నర్ మాట్లాడుతుండగా.. ఖలీల్ ఏదో అన్నాడని వేలు పెట్టి చూపించాడు తెవాటియా. ఆ సమయంలో అతడు తీవ్ర ఆవేశంలో ఉన్నాడు. వార్నర్, అంపైర్లు సర్దిచెప్పడంతో తెవాటియా శాంతించాడు. ఆపై అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి డగౌట్ చేరుకున్నాడు. ప్రస్తుతం ఖలీల్ అహ్మద్, రాహుల్ తెవాటియా గొడవకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఖలీల్ తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories