IPL 2020: విజృంభించిన మిస్ట‌ర్ 360.. బెంగ‌ళూర్ 'రాయ‌ల్' విక్టరీ

IPL 2020: విజృంభించిన మిస్ట‌ర్ 360.. బెంగ‌ళూర్ రాయ‌ల్ విక్టరీ
x
Highlights

IPL 2020: మిస్ట‌ర్ 360 ఏబీ డివిలియర్స్ మ‌రోసారి మెరిశాడు. త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్ తో ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌కు చుక్కులు చూపించాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెలారేగాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు.

IPL 2020: మిస్ట‌ర్ 360 ఏబీ డివిలియర్స్ మ‌రోసారి మెరిశాడు. త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్ తో ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌కు చుక్కులు చూపించాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెలారేగాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుత ప్రదర్శన ఇచ్చి.. జ‌ట్టును విజ‌య తీరాల్లో నిలిపాడు. రాజస్థాన్‌ నిర్దేశించిన 178 పరుగుల ఛేదనలో డివిలియర్స్ 22 బంతుల్లో ఏకంగా ఆరు సిక్సులు, ఒక ఫోర్‌తో వీర విహారం చేశాడు హ‌ఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకుని 55 ప‌రుగులు చేశాడు. మ‌రో నాలుగు బంతులు ఉండ‌గానే .. బెంగళూర్‌కు 7 వికెట్ల తేడాతో గెలిపించాడు.

మిగిలినవారిలో దేవదూత్‌ పడిక్కల్‌ 35 పరుగులు, ఆరోన్‌ ఫించ్‌ 14 పరుగులు, విరాట్‌ కోహ్లి 43 పరుగులు, గురుకీరత్‌ 19* పరుగులు సాధించారు. అలాగే.. రాజస్తాన్‌ బౌలర్లలో శ్రేయాస్‌ గోపాల్‌, కార్తీక్‌ త్యాగి, రాహుల్‌ తెవాటియాలు తలో వికెట్‌ తీశారు.

అంతకముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన రాబిన్‌ ఊతప్ప కూడా వీర విహారం చేశాడు. 22 బంతుల్లో 41 ప‌రుగులు చేసి జ‌ట్టుకు శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్ మంచి ఫామ్ తో 36 బంతుల్లో 6 ఫోర్లు , 1 సిక్సు స‌హాయంలో 57 ప‌రుగులు చేశాడు. జోస్‌ బట్లర్ 25 బంతుల్లో 24 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విజయంతో ఆర్‌సీబీ 12 పాయింట్లతో టెబుల్లో మూడో స్థానంలో.. రాజ‌స్థాన్‌ 6 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories