IPL 2020: పూర‌న్ ఫీల్డింగ్‌కు ఫిదా..

IPL 2020: పూర‌న్ ఫీల్డింగ్‌కు ఫిదా..
x

IPL 2020: పూర‌న్ ఫీల్డింగ్‌కు ఫిదా..

Highlights

IPL 2020: ఐపీఎల్ 2020 ప్ర‌తి మ్యాచ్ చాలా ఉత్కంఠగా జ‌రుగుతుంది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ ఫ‌లితం చెప్ప‌డం చాలా కష్టం . నిన్న జ‌రిగిన పంజాబ్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ మ్యాచ్‌లో కూడా అంతే ..

IPL 2020: ఐపీఎల్ 2020 ప్ర‌తి మ్యాచ్ చాలా ఉత్కంఠగా జ‌రుగుతుంది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ ఫ‌లితం చెప్ప‌డం చాలా కష్టం . నిన్న జ‌రిగిన పంజాబ్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ మ్యాచ్‌లో కూడా అంతే .. ఈ మ్యాచ్ లో బ్యాట్మాన్స్ సిక్సుర్ల సునామీతో ప‌రుగుల వ‌ర‌దను పారింది. ఈ మ్యాచ్ లో బౌల‌ర్ల‌పై బ్యాట్ మెన్స్ దండ‌యాత్ర చేశారు. ప్ర‌తి ఓవ‌ర్‌లో స్ట్రైక్ రేట్ 10 కిపైగా న‌మోదు అయ్యిందంటే ఏవిధంగా విరుచుక‌ప‌డ్డారో .. తెలుస్తుంది. ఈ క్ర‌మంలో కింగ్ లెవ‌న్ పంజాబ్ ఆటగాడు నికోలస్ పూరన్ బౌండరీ వద్ద బంతిని ఆపిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. సిక్స్ వెళ్లే బంతిని గాల్లోనే అందుకొని దాన్ని తిరిగి గ్రౌండ్‌లోకి విసిరేశాడు. దీన్ని చూసిన దిగ్గజ ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు. ఇది అద్భుతమైన ఫీల్డింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్ , కింగ్స్ లెవన్ పంజాబ్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. ఆ సమయంలో మురుగన్ అశ్విన్ 8వ ఓవర్ వేశాడు. దీన్ని క్రీజులో ఉన్న సంజూ శాంసన్ భారీ షాట్లతో బౌండరీ వైపు బాదాడు. అంతా అది సిక్స్ అని భావించారు. కానీ అప్పటికే బౌండరీ లైన్ వద్ద వేగంగా వచ్చిన పూరన్ గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకున్నాడు. తాను బౌండరీ అవతల పడేకంటే ముందే తిరిగి మైదానంలోకి విసిరేశాడు. అంతే ఆరు పరుగులు రావాల్సిన చోట కేవలం 2 మాత్రమే వచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా ఫీల్డింగ్ చేశారు. ఆయ‌నకు అంతా ఫిదా అవుతున్నారు. ఈ జ‌ట్టు ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ సైతం లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టాడు. పూర‌న్ ఫిల్డింగ్ స‌చిన్ సైతం ఫిదా అయ్యారు. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. నా జీవితంలో చూసిన అద్భుతమైన సేవ్ అంటూ ప్రశంసించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories