IPL 2020: న్యూ జెర్సీలో ఆర్సీబీ.. కార‌ణ‌మేంటి?

IPL 2020: న్యూ జెర్సీలో ఆర్సీబీ.. కార‌ణ‌మేంటి?
x
Highlights

IPL 2020: ‌రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతి ఏటా ఏదోక ప్ర‌త్యేక‌త‌ను చాటు‌కుంటుంది. ఈ యేడాది కూడా ఓ ప్ర‌త్యేక‌మైన కాస్‌తో ముందుకు రానున్న‌ది. ఆదివారం మ్యాచ్ లో రెగ్యులర్‌ జెర్సీ కాకుండా మ‌రో క‌ల‌ర్ జెర్సీ వేసుకుంటారు.

IPL 2020: ‌రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతి ఏటా ఏదోక ప్ర‌త్యేక‌త‌ను చాటు‌కుంటుంది. ఈ యేడాది కూడా ఓ ప్ర‌త్యేక‌మైన కాస్‌తో ముందుకు వెళ్లనున్నది. ఇందులో భాగంగానే ఆదివారం మ్యాచ్ లో రెగ్యులర్‌ జెర్సీ కాకుండా మరో కలర్ జెర్సీ వేసుకోనున్నారు. దానికి ఓ ప్రత్యేక కారణమున్నదది . ఈ ఏడాది కూడా ఓ సంక‌ల్పంతో విరాట్ కోహ్లీ సేనా ఆదివారం సాయంత్రం జరిగే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో గ్రీన్ కలర్ జెర్సీని ధరించనుంది.

ప్రపంచం కాలుష్యం బారిన పడి వాతావరణం హానికరంగా మారుతున్న నేపథ్యంలో చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే పేరిట బెంగళూరు ఈ గ్రీన్ కలర్ జెర్సీని ధరించనుంది. ఈ మేరకు ఆర్‌సీబీ ట్విటర్ వేదిక‌గా ఓ వీడియోను పోస్టు చేసింది. లెట్స్‌ గో గ్రీన్ పేరుతో ఈ ఇనిషియేటివ్‌ను ఆర్‌సీబీ ప్రమోట్ చేస్తోంది. ఈ మేరకు ఆర్సీబీ ఓ వీడియోను విడుదల చేసింది. పర్యావరణం కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం తమవంతు కృషి చేయాలని, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడంటే అక్కడ పడేయకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నాడని ఏబీ డెవీలియర్స్ చెప్పాడు. తన పిల్లలకు కూడా పర్యావరణంపై అవగాహన క‌ల్పించాలి.

2011 నుంచి ఆర్‌సీబీ గో గ్రీన్ కార్యక్రమం చేపడుతోందని విరాట్ కోహ్లీ చెప్పాడు . పర్యావరణం కాపాడుకుంటేనే అందరం బాగుంటామని చెప్పాడు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి పర్యావరణంను కాపాడుకుందామని విరాట్ పిలుపునిచ్చాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories