IPL 2020: ప్ర‌తి ఒక్క‌రి నుండి పూర్తి స్థాయి ప్ర‌ద‌ర్శ‌న కావాలి.. తోటి ఆట‌గాళ్ల‌కు క్లాస్ తీసుకున్న విరాట్‌

IPL 2020: ప్ర‌తి  ఒక్క‌రి నుండి  పూర్తి స్థాయి ప్ర‌ద‌ర్శ‌న కావాలి..  తోటి ఆట‌గాళ్ల‌కు క్లాస్ తీసుకున్న విరాట్‌
x

Reduce Workload, But I Want Intensity In Practice' - Skipper Virat Kohli's Message To RCB

Highlights

IPL 2020: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ రానే వ‌చ్చింది. దీంతో అన్ని టీంలు ముమ్మ‌రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇన్నిరోజులు క్వారెంటైన్‌లో ఉన్న చెన్నై కూడా మైదానంలోకి అడుగుపెట్టింది.

IPL 2020: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ రానే వ‌చ్చింది. దీంతో అన్ని టీంలు ముమ్మ‌రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇన్నిరోజులు క్వారెంటైన్‌లో ఉన్న చెన్నై కూడా మైదానంలోకి అడుగుపెట్టింది. ఈ త‌రుణంలో ఆర్సీబీ కెప్టెన్ త‌న టీంకు క్లాస్ తీసుకుంటున్న వీడియో ఒక్క‌టి వైర‌ల్ అవుతుంది.

ఐపీఎల్ 2020 కోసం ఆర్సీబీ ఆగ‌స్టు 28 నుంచి త‌న ట్రెనింగ్ సెష‌న్ ప్రారంభించింది. షార్జాలోని ఓ క్రికెట్ గ్రౌండ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తన టీంలో ఇంటెన్సిటీ మీద క్లాస్ తీసుకుంటున్న ఓ వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కోహ్లీ ఫ్లేయ‌ర్స్ తో ఇలా అంటున్నాడు.'' మీకు కావాలంటే వ‌ర్క్‌లోడ్ త‌గ్గిస్తాను. కానీ ప్ర‌తి ఫ్లేయ‌ర్ నుంచి పూర్తి శ‌క్తి సామ‌ర్థ్యాల‌తో కూడిన ప్ర‌ద‌ర్శ‌న కావాలి. ఒక వేళ కావాలంటే .. ఈ విషయం పై మాట్లాడి.. చ‌ర్చించుకుందాం. వ‌ర్క్ లోడ్ త‌గ్గిస్తున్నాను. కానీ క్వాలిటీ వ‌ర్క్ కావాలి. మీరు తక్కువ వ‌ర్క్ అవుట్ చేసిన‌.. అందులో పూర్తిగా నిమ‌గ్నం కావాలి. ఎక్కువ వ‌ర్క్ చేసి త్వ‌ర‌గా అలసిపోవ‌డం నాకు ఇష్టం లేదు. మొద‌ట‌గా మన శ‌క్తి సామర్థ్యాలను పెంచుకోవాలని వీడియోలో కోహ్లీ చెప్పుకోచ్చారు.

దీనిపై ఆర్సీబీ ఫేస‌ర్ న‌వ‌దీప్ స్పందిస్తూ.. మాకు సెష‌న్స్ బాగా జ‌రుగుతున్నాయి. సీనియ‌ర్లంద‌రూ ఇంటెన్సిటీని ఏవిధంగా పెంచుకోవాల‌ని చెబుతున్నారు. మ‌నంలో శ‌క్తి సామ‌ర్థ్యాలు ఎక్కువ‌గా ఉంటే .. క‌ష్ట‌మైన ప‌ని అయిన త‌ర్వ‌గా అయిపోతుంది. ప్ర‌స్తుతం టీం మెంబ‌ర్స్ అంతా దీనిపైనే వర్క్ చేస్తున్నారు. ఐపీఎల్ సెప్టెంబ‌ర్ 19 నుంచి న‌వంబ‌ర్ 10 వ‌ర‌కు యూఏఈ లో జ‌రుగ‌నున్న‌ది. యూఏఈలో దుబాయి, అబుదాబీ, షార్జాలోని టీంల‌లో మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories