IPL 2020: అందుకే ఇషాన్ కిషాన్ ను పంప‌లేదు: రోహిత్ శర్మ

IPL 2020: అందుకే ఇషాన్ కిషాన్ ను పంప‌లేదు: రోహిత్ శర్మ
x

అందుకే ఇషాన్ కిషాన్ ను పంప‌లేదు: రోహిత్ శర్మ

Highlights

IPL 2020: ఐపీఎల్ నిజంగా క్రికెట్ అభిమానుల‌కు చాలా వినోదాన్ని పంచుకుంది. ప్ర‌తి రోజు ప్ర‌తి మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగుతుంది. చివ‌రి ఓవ‌ర్ లో చివ‌రి బంతి వ‌ర‌కూ గెలుపోటములు దాగుడు మూత‌లు ఆడుతున్నాయి.

IPL 2020: ఐపీఎల్ నిజంగా క్రికెట్ అభిమానుల‌కు చాలా వినోదాన్ని పంచుకుంది. ప్ర‌తి రోజు ప్ర‌తి మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగుతుంది. చివ‌రి ఓవ‌ర్ లో చివ‌రి బంతి వ‌ర‌కూ గెలుపోటములు దాగుడు మూత‌లు ఆడుతున్నాయి. ఈ సీజ‌న్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య వీరోచితమైన పోరు జ‌రిగింది. ఈ మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్ వ‌ర‌కూ వెళ్లింది. ఈ సూప‌ర్ కూడా ఉత్కంఠ భ‌రితంగా సాగింది. చివ‌రిగా విరాట్ కోహ్లీ సేన విజయం సాధించింది.

టచ్‌లో ఉన్న ఇషాన్ కిషాన్‌ను కాకుండా హార్దిక్ పాండ్యాను ఎందుకు సూపర్ ఓవర్‌లో పంపించారని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో రోహిత్ శర్మను అడగ్గా .. ఇషాన్ కిషన్ అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాడని, అందుకే అతడిని మళ్లీ బ్యాటింగ్‌కు పంపలేదని, సూపర్ ఓవర్‌లో ఫీల్డింగ్ కూడా చేయించలేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

'ఇదో అద్భుత మ్యాచ్. మా ఆరంభం ప్రకారం మేం అసలు ఈ గేమ్‌లోనే లేం. కానీ ఇషాన్‌ కిషన్‌ (99; 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్స్‌లు), కీరన్ పోలార్డ్‌ (60 నాటౌట్‌; 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మ్యాచ్ తమవైపు తిప్పారు. మేం మంచి ఆరంభాన్ని అందుకోకున్నా.. 200 పరుగులు చేస్తామనుకున్నా. ఎందుకంటే పొలార్డ్, ఇషాన్ కిషాన్ క్రీజులో ఉన్నారు కాబట్టి ఏదైనా జరగవచ్చు అని ఊహించా. ఇషాన్ గెలిపిస్తాడని భావించా. మేమంతా చాలా నమ్మకంగా ఉన్నాం.

అప్పటికే బాగా అలసిపోయిన ఇషాన్ కిషన్ సూపర్ ఆడేందుకు అంతగా సౌకర్యవంతంగా కనిపించలేదన్నాడు. కీరన్ పోలార్డ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు కానీ ఇషాన్ కిషన్‌లా అలసిసోలేదు. దాంతో మేం పోలార్డ్ తో పాటు బ్యాటింగ్‌కు దిగని హార్ధిక్ పాండ్యాను బ్యాటింగ్‌కు పంపినట్లు పేర్కొన్నాడు. హిట్టింగ్ చేస్తాడని పాండ్యాను పంపించాం, కానీ అన్ని మనం అనుకున్నట్లుగా జరగవు కదా అని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ వివరించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories