IPL 2020: కోల్‌క‌తా, బెంగళూరుల హోరాహోరీ

IPL 2020: కోల్‌క‌తా, బెంగళూరుల హోరాహోరీ
x
Highlights

IPL 2020: ఐపీఎల్‌2020 నేడులో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ లు హోరాహోరీగా త‌ల‌ప‌డ‌నున్నాయి. సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌పై సూపర్‌‌ విక్టరీ సాధించి, రెట్టించిన ఉత్సాహంతో ఉన్న కోల్‌‌కతా ప్లే ఆఫ్‌‌ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ప్ర‌య‌త్నిస్తున్న‌ది

IPL 2020: ఐపీఎల్‌2020 నేడులో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ లు హోరాహోరీగా త‌ల‌ప‌డ‌నున్నాయి. సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌పై సూపర్‌‌ విక్టరీ సాధించి, రెట్టించిన ఉత్సాహంతో ఉన్న కోల్‌‌కతా ప్లే ఆఫ్‌‌ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ప్ర‌య‌త్నిస్తున్న‌ది. మరోపక్క ఆడిన తొమ్మిది మ్యాచ్‌‌ల్లో 12 పాయింట్లు సాధించి మూడో ప్లేస్‌‌లో ఉన్న ఆర్‌‌సీబీ మరో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌‌కు మరింత దగ్గరవ్వాలని భావిస్తోంది. దీంతో మరో ఉత్కంఠభ‌రిత పోరు ఖాయమనే చెప్పాలి.

బెంగళూరు ఈ సీజన్‌లో అంచనాలకు మించి రాణిస్తోంది. ఓపెనర్లు ఫించ్, పడిక్కల్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తుంటే.. మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ కోహ్లీ కీరోల్ పోషిస్తున్నాడు. ఇక ఎండింగ్‌లో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ తనదైన శైలి హిట్టింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్, స్పిన్నర్ యుజేవేంద్ర చాహల్ ఆర్సీబీకి అదనపు బలాలు. వీరిద్దరూ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి జట్టును రేస్‌లో నిలుపుతున్నారు. బౌలింగ్‌లో మోరిస్,ఉడానా,నవ్‌దీప్ సైనీ చెలరేగుతున్నారు. స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లకు తిరుగులేదు. గత రెండు మ్యాచ్‌ల్లో సుందర్ పరుగులిచ్చినా.. అది పెద్ద సమస్యే కాదు. అదొక్కటి సెట్ అయితే.. కోహ్లీసేనకు తిరుగుండదు.

మ‌రో కోల్‌క‌తా.. ఫెర్గుసన్‌‌ను మోర్గాన్ ఎలా వాడుకుంటార‌నే దానిపై ఆ జ‌ట్టు విజ‌యం ఆధారపడి ఉన్నాయి. ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ మెరుపులు ఈ జట్టుకు కరువయ్యాయి. అలాగే ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, దినేష్ కార్తీక్‌ల నిలకడ లేమి జట్టును గట్టి దెబ్బ తీస్తోంది. జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రెండో మ్యాచ్‌లోనే మోర్గాన్ తన మార్క్ చూపించాడు. బౌలర్ లోకీ ఫెర్గుసన్‌ను తుది జట్టులోకి తీసుకోవడంతో.. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. రస్సెల్ స్థానంలో క్రిస్ గ్రీన్‌ను తీసుకోవడం తప్పితే.. కేకేఆర్ మరో మార్పు చేసే అవకాశం కనిపించట్లేదు. ప్లేఆఫ్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కాబట్టి ఈ రోజు ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. ఈ మ్యాచ్‌లోనైనా గత మ్యాచ్ ఓటమికి కోల్‌కతా ప్రతీకారం తీర్చుకుంటుందా? లేక అనేది వేచి చూడాలి!

Show Full Article
Print Article
Next Story
More Stories