IPL 2020: రాయుడు ఉంటే.. ఫలితం మరోలా ఉండేది: ఎంఎస్‌కే ప్రసాద్

IPL 2020: రాయుడు ఉంటే.. ఫలితం మరోలా ఉండేది: ఎంఎస్‌కే ప్రసాద్
x

IPL 2020: MSK Prasad Says If Ambati rayudu was there the result would have been different  

Highlights

IPL 2020: రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు ఆటగాడు, ‌చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు లేని లోటు స్పష్టంగా కనిపించిందని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

IPL 2020: రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు ఆటగాడు, ‌చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు లేని లోటు స్పష్టంగా కనిపించిందని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. మ్యాచ్‌కు రాయుడు దూరం కావ‌డంతో చెన్నై ఓట‌మి పాలైంద‌ని అన్నారు. స్టార్ స్పోర్ట్స్ లో తెలుగు కామెంటేటర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న స‌మ‌యంలో ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఫిట్‌నెస్ సమస్యలతో ఈ మ్యాచ్‌కు రాయుడు దూరమయ్యాడని టాస్ సందర్భంగా కెప్టెన్ ధోనీ పేర్కొన్నాడు.

చెన్నై వైఫల్యానికి కారణాలు ఏంటని సహచర తెలుగు కామెంటేటర్ ప్రశ్నించగా.. ఎంఎస్‌కే ఈ విధంగా స‌మాధానమిచ్చారు. 'రాయుడు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా భాగస్వామ్యాలు నెలకొల్పడంలో చెన్నై ఆట‌గాళ్లు విఫ‌ల‌మయ్యారు. మురళీ విజయ్ ఎక్కువ బంతులు ఆడిన క్రీజ్‌లో నిల‌దొక్కుకోలేక పోయాడు. సామ్ కరన్, రుతురాజ్ గైక్వాడ్ వెంట‌వెంటనే అవుట్ కావ‌డం. 217 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించాలంటే ఆరంభం నుంచే ధాటిగా ఆడాలి. రాహుల్ తెవాటియా బ్యాలింగ్‌లో వాట్సన్ అవుట్ కావ‌టంతో మ్యాచ్ మొత్తం మ‌లుపు తిరిగింది. రాయుడు ఉంటే ఫలితం మరోలా ఉండేది. అని ఎంఎస్‌కే చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories