IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై, పంజాబ్‌ నిలువరించేనా?

IPL 2020:  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై,  పంజాబ్‌ నిలువరించేనా?
x
Highlights

IPL 2020: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆదివారం దుబాయ్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌, కింగ్స్‌ పంజాబ్‌ల మధ్య మ‌రో ఉత్కంఠ పోరు జ‌రుగుతున్న‌ది. ఈ మ్యాచ్‌ టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ ఏంచుకుంది

IPL 2020: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆదివారం దుబాయ్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌, కింగ్స్‌ పంజాబ్‌ల మధ్య మ‌రో ఉత్కంఠ పోరు జ‌రుగుతున్న‌ది. ఈ మ్యాచ్‌ టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ ఏంచుకుంది. కాగా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న ముంబైని కింగ్స్‌ పంజాబ్‌ ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి. ఇందులో ఆసక్తికర విషయమేంటంటే ముంబై వరుసగా ఐదు విజయాలు నమోదు చేసి రెండో స్థానంలో ఉండగా.. కింగ్స్‌ పంజాబ్‌ మాత్రం వరుస ఐదు ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో ఆర్‌సీబీపై విజయం సాధించినా పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంది.

పిచ్ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ ఎంచుకున్నామ‌ని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. టాస్‌తో పనిలేదని, తాము కూడా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ చెప్పాడు.ఈ మ్యాచ్ లో ముంబాయి గెలిస్తే.. అగ్రస్థానం స్థానంలో నిలుస్తుంది. ఒక వేళ .. పంజాబ్ గెలిస్తే.. ప్లేఆఫ్స్‌ అవకాశాలు స‌జీవంగా ఉంటాయి. ఇప్పటి వరకూ ఈ రెండు జట్ల మధ్య జరిగిన 25 మ్యాచుల్లో జ‌రిగితే.. ముంబై 14 సార్లు గెలుపొందింది.

తుది జట్లు:

ముంబై ఫ్లేయింగ్ లెవ‌న్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, కౌల్టర్ నైల్‌, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

పంజాబ్ ఫ్లేయింగ్ లెవ‌న్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్‌ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, క్రిష్ణప్ప గౌతమ్‌, మొహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్.

Show Full Article
Print Article
Next Story
More Stories