IPL 2020: బూమ్.. బూమ్.. బుమ్రా.. ఐపీఎల్ లో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌

IPL 2020: బూమ్.. బూమ్.. బుమ్రా.. ఐపీఎల్ లో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌
x

బుమ్రా.. ఐపీఎల్ లో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌

Highlights

IPL 2020: ఐపీఎల్ .. అంటే రాకెట్ లాంటి వేగంతో బంతులు విసిరే బౌల‌ర్లు. బ్యాట్మెన్ల‌ బాదుడు. ప్రతి మ్యాచ్ చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ ఉత్కంఠ‌గా సాగుతుంది. అంత‌కూ మించిన మాజా ఐపీఎల్ లోనే దొరుకుతుంది.

IPL 2020: ఐపీఎల్ .. అంటే రాకెట్ లాంటి వేగంతో బంతులు విసిరే బౌల‌ర్లు. బ్యాట్మెన్ల‌ బాదుడు. ప్రతి మ్యాచ్ చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ ఉత్కంఠ‌గా సాగుతుంది. అంత‌కూ మించిన మాజా ఐపీఎల్ లోనే దొరుకుతుంది. ఈ ఫార్మాట్ లో బౌల‌ర్ల‌కు ఎంత క్రేజ్ ఉంటుందో .. బ్యాట్‌మెన్స్ కూడా అంతే క్రేజ్ ఉంటుంది.

ఈ సీజ‌న్‌లో భార‌త పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. త‌న అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొడుతున్నాడు. ప్ర‌త్య‌ర్థి బ్యాట్మెన్ల‌లు బ్యాట్ ఝూళిపించాలంటే .. భ‌య‌ప‌డేలా చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న బుమ్రా.. ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో కూడా ఎలాంటి బ్యాట్స్‌మన్‌ను అయినా బోల్తా కొట్టించడం బుమ్రా ప్రత్యేకత. మంగళవారం రాత్రి రాజస్థాన్, ముంబాయి మ‌ధ్య జరిగిన మ్యాచ్‌లో త‌న ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారి నాలుగు వికెట్లు తీశాడు. బూమ్రా చేసిన‌ నాలుగు ఓవర్లలో 4 వికెట్లు తీసి, 20 పరుగులు ఇచ్చాడు.

అలాగే.. ఐపీఎల్ 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.ఐపీఎల్ 2016లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 13 పరుగులు ఇచ్చి 3 మూడు వికెట్లు ప‌డ‌గొట్టి అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు.

ఈ మ్యాచ్‌లో బుమ్రా తన మొదటి మూడు ఓవర్లలో కేవలం 8 పరుగులు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మొదటి ఓవర్లో స్టీవ్ స్మిత్ వికెట్ తీసి 2 రన్స్ ఇచ్చాడు. రెండో ఓవర్ లోనూ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చి కేవ‌లం 4 పరుగులు ఇచ్చాడు. మళ్లీ 16వ ఓవర్ వేసిన బుమ్రా.. రాహుల్ తెవాటియా, శ్రేయాస్ గోపాల్ వికెట్లు తీసి రెండు 2 రన్స్ ఇచ్చాడు. ఇక 18 ఓవర్లో జోఫ్రా ఆర్చర్ రెండు బౌండరీలు బాదడంతో 12 పరుగులొచ్చాయి. చివరి బంతిని అతన్ని ఔట్ చేసి నాలుగో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories