సన్ 'రైజర్స్'.. పంజాబ్ ఘోర పరాజయం.. పూరన్ శ్రమ వృధా!

సన్ రైజర్స్.. పంజాబ్ ఘోర పరాజయం.. పూరన్ శ్రమ వృధా!
x
Highlights

IPL 2020 Match 22 Updates: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇచ్చిన భారీ విజయలక్ష్యాన్ని అందుకోలేక చేతులెత్తేసింది పంజాబ్ జట్టు. ఒక్క పూరన్ మినహా మిగిలిన ఆటగాళ్ళు అంతా వేగంగా పెవిలియన్ చేరిపోయారు.

పూరన్ ఒంటరి పోరుకు సహకరించే వారే కరువయ్యారు.. బోర్డు మీద భారీ లక్ష్యం బెదిరిస్తున్న వేళలో పంజాబ్ బ్యాట్స్ మెన్ ఎవరూ నిలబడి ఆడే ప్రయత్నం చేయలేదు. దాంతో హైదరాబాద్ విసిరిన 202 పరుగుల టార్గెట్ కు చాలా దూరంలో ఆగిపోయారు. దీంతో హైదరాబాద్ 69 పరుగులతో ఇంకా 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది.

కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాళ్లలో నికోలస్‌ పూరన్‌(77; 37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒక్కడే హైదరాబాద్ బౌలర్లను ఎదుర్కొని నిలిచాడు. మిగిలిన ఆటగాళ్ళు ఎవరూ హైదరాబాద్ బౌలింగ్ ముందు నిలబడలేకపోయారు. దీంతో పంజాబ్ 69 పరుగుల తేడాతో ఘోర పరాజయం చెందింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ మూడు వికెట్లు సాధించగా, ఖలీల్‌ అహ్మద్‌, నటరాజన్‌ తలో రెండు వికెట్లు సాధించారు. అభిషేక్‌ శర్మకు వికెట్‌ లభించింది. మరో ఇద్దరు కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాళ్లు రనౌట్‌ అయ్యారు. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(9), ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు సిమ్రాన్‌ సింగ్‌(11)ల వికెట్లను ఆదిలోనే కింగ్స్‌ పంజాబ్‌ కోల్పోగా ఆ తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన పూరన్‌ హైదరాబాద్ బౌలర్ల పై విరుచుకు పడ్డాడు. ఈ క్రమంలో 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అభిషేక్‌ శర్మ వేసిన ఏడో ఓవర్‌లో రెండు సిక్స్ లు బాడిన పూరన్.. తరువాత 9 వ ఓవర్లో సిక్సర్ల మోత మోగించాడు. అబ్దుల్‌ సామద్‌ వేసిన ఈ ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్‌ కొట్టాడు. ఈ క్రమంలోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకుని ఈ సీజన్‌ ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. పూరన్‌కు మిగతా వారి నుంచి సరైన మద్దతు లభించలేదు. పూరన్‌ ఏడో వికెట్‌గా రషీద్‌ ఔట్‌ చేసిన కాసేపటికి కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. తరువాత ఒక ఎండ్ లో బెయిర్‌ స్టో రెచ్చిపోతుంటే.. మరో ఎండ్ లో పంజాబ్ పై తన రికార్డును పదిలంగా కాపాడుకుంటూ వార్నర్ దంచి కొట్టాడు. దీంతో సన్ రైజర్స్ జట్టు 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.

వార్నర్ రికార్డ్ హాఫ్ సెంచరి..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌.. కింగ్స్‌ పంజాబ్‌ తొ మ్యాచ్ అంటేనే పరుగుల వరద పారిస్తాడు. ఇప్పుడు దుబాయ్ లోనూ అదే చేశాడు. ఈ మ్యాచ్ లో వార్నర్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్థ శతకం సాధించాడు. ఫలితంగా కింగ్స్‌ పంజాబ్‌పై వరుసగా తొమ్మిదో హాఫ్‌ సెంచరీ సాధించినట్లయ్యింది. ఐపీఎల్‌లో ఒక ప్రత్యర్థిపై ఇలా తొమ్మిది హాఫ్‌ సెంచరీలు వరుసగా సాధించడం వార్నర్‌కు పంజాబ్‌పైనే అత్యధికం కావడం విశేషం. 2015 నుంచి 2020 మధ్య కాలంలో పంజాబ్‌పై ఆడిన ప్రతీసారి వార్నర్‌ హాఫ్‌ సెంచరీ సాధిస్తూ వస్తున్నాడు. ఇక ఆర్సీబీపై వరుసగా 7హాఫ్‌ సెంచరీలను వార్నర్‌ సాధించగా, సీఎస్‌కేపై వరుసగా 5 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు.

హైదరాబాద్ బ్యాటింగ్‌ను వార్నర్‌, బెయిర్‌ స్టోలు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లను ఆదేసుకుని ఆరేసుకున్నారు. ఈ క్రమంలో ముందుగా బెయిర్‌ స్టో హాఫ్‌ సెంచరీ సాధించాడు. తరువాత కాసేపటికి వార్నర్‌ అర్థ శతకం బదేశాడు. వార్నర్‌ 40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌తో 52 పరుగులు చేసిన తర్వాత తొలి వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో హైదరాబాద్ 160 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.ఆపై వెంటనే బెయిర్‌ స్టో(97; 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఔటయ్యాడు. ఇక తరువాత హైదరాబాద్ కత మారిపోయింది. వీరిద్దరూ అవుట్ అయినా హైదరాబాద్ కచ్చితంగా 220 పరుగులన్నా చేస్తుందని అభిమానులు అంచనావేశారు. అయ్తీ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ క్యూ కట్టారు. మొదట 160 పరుగుల వద్దే ఎస్‌ఆర్‌హెచ్‌ మరో వికెట్‌ను కోల్పోగా, మరో పరుగు వ్యవధిలో మనీష్‌ పాండే(1) వికెట్‌ను నష్టపోయింది. అర్షదీప్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పాండే నిష్క్రమించాడు. దీంతో హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ పరిస్థితి ఎప్పటిలానే ఉందని తేలిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories