IPL 2020: నేడే సన్‌రైజ‌ర్‌, నైట్ రైడర్స్ పోరు.. బోణీ ఎవ‌రిదో?

IPL 2020: నేడే సన్‌రైజ‌ర్‌, నైట్ రైడర్స్ పోరు.. బోణీ ఎవ‌రిదో?
x

IPL 2020: నేడే సన్‌రైజ‌ర్‌, నైట్ రైడర్స్ పోరు.. బోణీ ఎవ‌రిదో?

Highlights

IPL 2020: ఐపీఎల్ క్రికెట్ అభిమానుల‌కు అస‌లైన మాజాను అందిస్తుంది. ఐపీఎల్ 2020 ప్రారంభమై ఇప్పటికే వారం రోజులు అయింది. ఇందులో ప్ర‌తి మ్యాచ్ అభిమానులను ఉత్సాహ ప‌రిచింది.

IPL 2020: ఐపీఎల్ క్రికెట్ అభిమానుల‌కు అస‌లైన మాజాను అందిస్తుంది. ఐపీఎల్ 2020 ప్రారంభమై ఇప్పటికే వారం రోజులు అయింది. ఇందులో ప్ర‌తి మ్యాచ్ అభిమానులను ఉత్సాహ ప‌రిచింది. నేడు అబుదాబి లోని షేక్ జాయెద్ స్టేడియం వేదిక‌గా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ మ‌ధ్య జ‌రుగునున్న మ్యాచ్ కూడా ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగ‌నున్న‌ది. ఈ పోరు హోరా హోరీ పోరు జరుగ‌నున్న‌ది. ఇరు జట్లు ఎలాగైనా బోణీ కొట్టాలని ఆశిస్తున్నాయి. ఈ మేరుకు ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.

ఆడిన తొలిమ్యాచ్‌లో సన్‌రైజర్స్ టీంలో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. మనీష్ పాండే, బెయిర్‌స్టో రాణించినప్పటికీ.. త‌రువాత వ‌చ్చిన ఆట‌గాళ్లు స‌రిగా ఆడ‌లేక పెవిలియన్‌ దారి ప‌ట్టారు. ఇది ఇప్పుడు హైదరాబాద్‌ జట్టును కలవరానికి గురిచేస్తోంది. అయితే తొలి మ్యాచ్‌లో రనౌట్‌గా వెనుదిరిగిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మంచి ఆరంభాన్ని అదించగలిగితే.. కోల్‌కత్తాపై విజయం సాధించడం కష్టమేమి కాదని విశ్లేషకులు అంటున్నారు. అలాగే గాయపడిన మిషెల్ మార్ష్ టోర్ని నుంచి తప్పుకోవడంతో.. అతని స్థానంలో వెస్టిండీస్ అల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను తీసుకున్నట్టు సన్‌రైజర్స్ ప్రకటించింది.

అయితే ఇప్పటికే యూఏఈ చేరకున్న హోల్డర్ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. అతనికి మూడుసార్లు కరోనా నెగిటివ్‌గా నిర్దారణ అయితే జట్టులోకి తీసుకోనున్నారు. లేకపోతే మరో ఆటగాడు జట్టులో చోటు కల్పించనున్నారు. ఇక, సన్‌రైజర్స్‌కు.. వార్నర్‌తో పాటు కేన్‌ విలియమ్సన్‌, మనీష్‌ పాండే, జానీ బెయిర్‌ స్టో, విజయ్‌ శంకర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌లు ఆ జట్టుకు ప్రధాన బలంగా కాగా, సిద్దార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, మహ్మద్‌ నబీల రూపంలో కూడా మంచి బౌలింగ్‌ లైనప్ ఉంది.

మరోవైపు కోల్‌కతా నైట రైడర్స కెప్టెన్ దినేశ్ కార్తీక్ నేతృత్వంలో ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలి నుంచి కోల్‌కతాపై ముంబై పై చేయి సాధిస్తూ వచ్చింది. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ అంతగా ప్రభావం చూప‌లేక‌పోయింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ కాస్త ప‌ర్వాలేద‌నిపించిన .. ఇత‌ర ఆట‌గాళ్లు నిలకడగా రాణించకపోవడంతో.. ఆ జట్టు ఓటమి పాలైంది.

ఇక, నేటి పోరులో బ్యాటింగ్, బౌలింగ్‌ రెండింటిలో రాణించగలిగితేనే కోల్‌కతా జట్టు విజయం సాధించగలుగుతోంది. ముఖ్యంగా భువనేశ్వర్, రషీద్ ఖాన్‌లు బౌలింగ్‌ను కేకేఆర్ ఎలా ఎదుర్కొంటుందనే దానిపై కూడా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories