IPL 2020: కోల్‌కతా బౌలర్‌పై బీసీసీఐకు ఫిర్యాదు.. వేటు ప‌డేనా!?

IPL 2020: కోల్‌కతా బౌలర్‌పై బీసీసీఐకు ఫిర్యాదు.. వేటు ప‌డేనా!?
x

కోల్‌కతా బౌలర్‌పై బీసీసీఐకు ఫిర్యాదు.. వేటు ప‌డేనా!?

Highlights

IPL 2020: ఐపీఎల్ 2020 లో కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక ఆటగాడు, స్పిన్నర్ సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌పై మరోసారి ఫిర్యాదు నమోదైంది. దుబాయ్‌లో అక్టోబరు 9న కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్లు తలపడ్డాయి.

IPL 2020: ఐపీఎల్ 2020 లో కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక ఆటగాడు, స్పిన్నర్ సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌పై మరోసారి ఫిర్యాదు నమోదైంది. దుబాయ్‌లో అక్టోబరు 9న కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫనీ, ఉల్లాస్ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం నరైన్‌‌ను వార్నింగ్ లిస్ట్‌లో ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికైతే బౌలింగ్‌ వేయవచ్చని.. మరోసారి నరైన బౌలింగ్‌ యాక్షన్‌పై ఫిర్యాదు వస్తే.. ఈ ఐపీఎల్ టోర్నీలో బౌలింగ చేయకుండా సస్పెండ్‌ చేస్తామని బీసీసీఐ అధికారులు తెలిపారు. ఒకవేళ అలా జరిగితే.. బీసీసీఐ సస్పెక్ట్ బౌలింగ్ యాక్షన్ కమిటీ నుంచి క్లియరెన్స్ వచ్చేవరకు నరైన్ బౌలింగ్ వేసే అవకాశమే ఉండదని స్పష్టంచేసింది. ఐతే అతడి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని గుర్తిస్తే.. కేవలం బౌలింగ్ చేయకుండా మాత్రమే నిషేధం విధిస్తారు. జట్టులో యథావిధిగా ఆడొచ్చు.

సునీల్ నరైన్‌ బౌలింగ్ యాక్షన్‌పై గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయి. 2014లో జరిగిన ఛాంపియన్స్‌ లీగ్‌లో రెండు సార్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సునీల్ నరైన్ 2015లో జరిగిన ప్రపంచ కప్‌కు దూరమయ్యాడు. అంతేకాదు అదే ఏడాదిలో జరిగిన ఐపీఎల్‌లో కూడా ఇలాంటి ఫిర్యాదులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఫలితంగా ఐసీసీ ఆ ఏడాది నవంబర్‌లో నరైన్‌ను సస్పెండ్‌ చేసింది. అయితే కోల్‌కతా కీలక ఆటగాడు సునీల్ నరైన్ తన బౌలింగ్ వైఖరిని మార్చుకోకపోతే వేటు త‌ప్పేట్లు లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories