IPL 2020: గ‌బ్బ‌ర్ గ‌ర్జ‌న.. ఢిల్లీ చేతిలో చెన్నై ఓట‌మి

IPL 2020: గ‌బ్బ‌ర్ గ‌ర్జ‌న.. ఢిల్లీ చేతిలో చెన్నై  ఓట‌మి
x

IPL 2020: గ‌బ్బ‌ర్ గ‌ర్జ‌న.. ఢిల్లీ చేతిలో చెన్నై ఓట‌మి

Highlights

IPL 2020: ఐపీఎల్ 2020లో శ‌నివారం జ‌రిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానుల‌కు ఎంతో మజాను అందించింది. చివ‌రి ఓవ‌ర్ వ‌రకూ గెలుపోట‌ములు దాకుడుమూత‌లు ఆడాయి. మంచి ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్లు క‌నిపించిన ధోని సేన మళ్లీ ఓట‌మి పాలైంది.

IPL 2020: ఐపీఎల్ 2020లో శ‌నివారం జ‌రిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానుల‌కు ఎంతో మజాను అందించింది. చివ‌రి ఓవ‌ర్ వ‌రకూ గెలుపోట‌ములు దాకుడుమూత‌లు ఆడాయి. మంచి ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్లు క‌నిపించిన ధోని సేన మళ్లీ ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్ మెన్ శిఖ‌ర్ దావ‌న్‌.. త‌న ఉగ్ర‌రూపం దాల్చాడు. చెన్నై నిర్ణ‌యించిన భారీ లక్ష్య చేధ‌న‌లో త‌న స‌హ‌చ‌ర బ్యాట్స్ మెన్ ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా.. జట్టంతా కలసి తనమైన స్కోర్ చేయకున్నా శిఖర్ ఒక్కడే ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. చివ‌రి వ‌ర‌కూ గెలుపు మాదే అనుకున్న చెన్నై కి నిరాశే మిగిల్చింది.

ఈ క్ర‌మంలో శిఖ‌ర్ అత్యుత‌మైన స్ట్రైక్ రేట్ తో త‌న మొద‌టి సెంచ‌రీ న‌మోదు చేసుకున్నాడు. ఎప్పటిలా తన మార్క్ క్లాస్ ఆట తీరుతో గ్యాప్ దొరికితే చాలు బంతిని బౌండరీకి తరలిస్తూ ఏకంగా 14 ఫోర్లు ఓ చక్కటి సిక్సర్ బాదాడు. మునుపటి ధావన్ ని తలపించాడు. చివర్లో కాస్త టెన్షన్ పడ్డా అక్షర్ పటేల్ బ్యాటింగ్ విన్యాసం ఢిల్లీ క్యాపిటల్స్ కి అద్భుత విజయాన్ని కట్టబెట్టింది. పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్ర స్థానానికి చేరింది.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు సాధించింది. సామ్ కరాన్ తొలి ఓవ‌ర్ లోనే డకౌట్ అయినా డుప్లెసిస్-షేన్ వాట్సన్ జోడి ఆచీ తూచీ ఆడుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.వాట్సన్ 28 బంతుల్లో6 ఫోర్లు స‌హాయంతో 36 పరుగులు చేశాడు. డుప్లెసిస్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సుల‌తో 58 ప‌రుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంబటి రాయుడు మ‌రో సారి త‌న క్లాసిక్ ప్ర‌ద‌ర్శ‌న‌తో 45 ప‌రుగులు చేసిన నాటౌట్ గా నిలిచాడు. చివ‌రిగా వ‌చ్చిన రవీంద్ర జడేజా త‌న ఇన్నింగ్స్‌తో మెరిసాడు. 13 బంతుల్లో 4 సిక్కుల‌తో 33 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో సీఎస్కే 179 పరుగులు చేసింది. ధోనీ (3) మరోసారి విఫలం అయ్యాడు.

ఛేదనలో ఢిల్లీకి మొదట్లోనే షాక్ తగిలింది. దీపక్ చహర్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. అజింక్యా రహానే(8) కూడా మరోసారి విఫలం అయ్యాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా అనుకున్న స్థాయిలో రాణించ‌లేక‌పోయాడు. 23 బంతుల్లో 22ప‌రుగులు చేసి వెనుదిరిగాడు. స్టోయినిస్ 14 బంతుల్లో 24 ప‌రుగులు చేశాడు. ధావన్ సెంచరీ చేసినా ఢిల్లీ చివర్లో కష్టాల్లో పడింది. చివరి ఓవర్లో ఢిల్లీకి 17 పరుగులు అవసరం కాగా జడేజా బౌలింగ్లో మూడు సిక్సర్లు బాదాడు. ఏకంగా 5 బంతుల్లోనే 21 పరుగులు చేసి మ్యాచ్ ని రెండు బంతులు ఉండగానే జ‌ట్టుకు విజ‌యం అందించాడు.

ఈ మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణ ధావనే నిలిచాడు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా చివరి దాకా ఆడాడు. రన్ రేట్ పడిపోకుండా దూకుడుగా ఆడాడు. బౌండరీలతోనే ధావన్ 62 పరుగులు సాధించాడు. మునుపటి ధావన్ కళ్ళముందు కదిలేలా బ్యాటింగ్ చేశాడు.ఈ విజయంతో ఢిల్లీ 14 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు చేరువ కాగా, చెన్నై అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories