IPL 2020: ధోనీ సేన పుంజుకునేనా..సన్ రైజ్ అవుతుందా?

IPL 2020:  ధోనీ సేన పుంజుకునేనా..సన్ రైజ్ అవుతుందా?
x

IPL 2020: CSK Vs SHR- Chennai Super Kings vs Sunrisers Hyderabad – Head to Head Records

Highlights

IPL 2020: ఐపీఎల్ 2020లో నేడు మ‌రో ఆస‌క్తిక‌ర పోరు జ‌రుగ‌నున్న‌ది. దుబాయి స్టేడియం వేదిక‌గా చెన్నై సూపర్ కింగ్స్స తో స‌న్‌రైజర్స్ హైదరాబాద్ పోరాడ‌నున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కూ.. ఇరు జ‌ట్టు చేరో మూడు మ్యాచ్‌లు ఆడి కేవ‌లం ఒక్కో మ్యాచ్‌ను మాత్ర‌మే గెలిచాయి.

IPL 2020: ఐపీఎల్ 2020లో నేడు మ‌రో ఆస‌క్తిక‌ర పోరు జ‌రుగ‌నున్న‌ది. దుబాయి స్టేడియం వేదిక‌గా చెన్నై సూపర్ కింగ్స్స తో స‌న్‌రైజర్స్ హైదరాబాద్ పోరాడ‌నున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కూ.. ఇరు జ‌ట్టు చేరో మూడు మ్యాచ్‌లు ఆడి కేవ‌లం ఒక్కో మ్యాచ్‌ను మాత్ర‌మే గెలిచాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచాయి. దీంతో ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ చాలా కీల‌కం కానున్న‌ది.

గత రికార్డుల‌ను ప‌రిశీలిస్తే.. ఇప్పటిదాకా ఈ రెండు జట్లు 12 సార్లు తలపడ్డాయి. ఇందులో తొమ్మిది సార్లు చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని సాధించగా.. కేవ‌లం మూడుసార్లు మాత్రమే హైదరాబాద్ గెలిచింది. మొత్తం మీద ఐపీఎల్‌లో తాను ఆడిన చివరి అయిదు మ్యాచుల్లో నాలుగింటిని కోల్పోయింది సన్ రైజర్స్. ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది.

ఈ సారి ఐపీఎల్‌లో ధోని సేన ఆశించిన స్థాయిలో ఆడ‌ట్లేదు. ఈ సీజ‌న్ ప్రారంభం కాక‌ముందే.. మిస్ట‌ర్ ఐపీఎల్ రైనా, హ‌ర్భ‌జ‌న్ సింగ్ దూరం కావ‌డం ఎదురు దెబ్బ. కానీ వారి లోటును అధిగ‌మించి.. తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టి ప‌ర్వాలేదని అని పిలిచింది. కానీ తరువాత ఆడిన రెండింట్లోనూ వరుసగా పరాజయాలను చవి చూసింది. గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన గత రెండు మ్యాచ్‌లకు దూరమైన అంబటి రాయుడు.. సన్‌రైజర్స్‌పై బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. రాయుడు వస్తే.. మురళీ విజయ్ లేదా రుతురాజ్ గైక్వాడ్‌లలో ఒకరు బెంచ్‌కే పరిమితం అవుతారు.

ఓ వేళ తొలి ప్రారంభ మ్యాచ్‌లో లాగా ఈ మ్యాచ్‌లో రాయుడు త‌న బాటును ఝూళిపిస్తే.. ప‌రుగుల వ‌ర‌ద ఖాయం. అలాగే బౌలింగ్ విభాగంలో డ్వేన్ బ్రావో‌ను తీసుకోనున్న‌ట్టు తెలుస్తుంది బౌలింగ్ లో బ్రావో విజృభిస్తే..హైద‌రాబాద్ జ‌ట్టుకు తిప్ప‌లు త‌ప్ప‌వు. షేన్ వాట్సన్, ఫాప్, కేదార్ జాదవ్, ధోనీ, రవీంద్ర జడేజా వంటి ఆల్‌రౌండర్లతో చెన్నై ప‌టిష్టంగా ఉంది.

ఇక హైదరాబాద్ జ‌ట్టును ప‌రిశీలిస్తే.. చెన్నైకంటే అన్నింట బలహీనంగానే కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ధోనీ సేన వీక్‌గానే ఉంది. సన్ రైజర్స్ బ్యాటింగ్ మొత్తం.. డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే లు బ్యాటింగ్ ఆర్డ‌ర్ ప‌ర్వాలేద అన్నట్టుగానే ఉంది. బౌలింగ్ లో రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ మంచి ఆర్డ‌ర్‌లో ఉన్నారు. గ‌త మ్యాచ్ లో ర‌షీద్ ఖాన్ ప్ర‌ద‌ర్శ‌న అదుర్స్ . ఆఖర్లో నటరాజన్ యార్కర్లతో హడలెత్తించాడు. ఖలీల్ అహ్మద్, అభిషేక్ శర్మ మాత్రమే ఎక్కువగా పరుగులిచ్చారు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ దాదాపు అదే జట్టుతో బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది.

పాయింట్ల పట్టికలో చెన్నై చివరి స్థానంలో ఉండగా.. హైదరాబాద్ ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు టాప్-4 లేదా టాప్-5లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో ధోనీ సేన పుంజుకునేనా..సన్ రైజ్ అవుతుందా? అనేది వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories